Champions Trophy Final | భారత్, న్యూజిలాండ్ మధ్య మరికొద్ది సేపట్లో చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానున్నది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ శాంటర్న్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కివీ జట్టులో ఒక మార్పు చేసింది. గాయం కారణంగా మాట్ హెన్నీ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో ఫాస్ట్ బౌలర్ నాథన్ స్మిత్‌కు అవకాశం కల్పించింది. భారత టాస్ కోల్పోవడం వరుసగా ఇది 15వసారి. టీమిండియా సెమీస్‌లో ఆస్ట్రేలియాతో బరిలోకి దిగిన జట్టుతోనే ఆడనున్నది. రోహిత్ శర్మ మాట్లాడుతూ తాను గత కొద్దిరోజులుగా మ్యాచులు ఆడుతున్నామని.. మొదట పలుసార్లు.. తర్వాత కొన్నిసార్లు బ్యాటింగ్ చేసినట్లు తెలిపారు. సెకండ్ ఇన్నింగ్‌లో బ్యాటింగ్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపాడు.
న్యూజిలాండ్ జట్టు: విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), కైల్ జామిసన్, విలియం ఓ రూర్కే, నాథన్ స్మిత్.
భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.