Champions Trophy | ఛాంపియన్స్ ట్రోఫీ దాదాపు దాదాపు మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్నది. చివరి సారిగా 2017లో జరిగిన ఐసీసీ ఈవెంట్‌ను పాకిస్థాన్ గెలుచుకున్నది. పాకిస్థాన్‌తో పాటు ఆతిథ్యం ఇవ్వనున్నది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) మంగళవారం టోర్నీ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఫిబ్రవరి 19న టోర్నీ ప్రారంభం కానుండగా.. ఫైనల్ మ్యాచ్ మార్చి 9న జరుగుతున్నది. ఎనిమిది జట్లు టోర్నీలో పాల్గొనుండగా.. మొత్తం 15 మ్యాచులు జరుగనున్నాయి. భారత జట్టు గ్రూప్ దశ మ్యాచ్‌లన్నీ దుబాయిలోనే జరుగుతాయి. మిగతా మ్యాచులన్నీ పాకిస్థాన్‌లో జరుగనున్నాయి. ఈ టోర్నీ 19 రోజుల పాటు కొనసాగుతుంది. పాకిస్థాన్‌లో జరిగే మ్యాచ్‌లకు రావల్పిండి, లాహోర్, కరాచీ ఆతిథ్యం ఇస్తాయి. పాకిస్థాన్‌లోని ఒక్కో స్టేడియంలో మూడు గ్రూప్ మ్యాచ్‌లు జరుగుతాయి. లాహోర్ రెండో సెమీ ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్‌కు ఫైనల్‌కు అర్హత సాధించకపోతే, మార్చి 9న జరిగే ఫైనల్‌కు లాహోర్ ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్ అర్హత సాధిస్తే.. ఫైనల్ మ్యాచ్ దుబాయిలో జరుగుతుంది. సెమీస్, ఫైనల్‌కు రిజర్వ్ డే ఉంటుంది.
champions trophy schedule
చాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య ఫిబ్రవరి 19న కరాచీలో జరుగుతుంది. పాక్ తన చివరి లీగ్ మ్యాచ్‌ను అదే నెల 27న బంగ్లాదేశ్‌తో రావల్పిండిలో ఆడుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాకిస్థాన్ మధ్య లీగ్ మ్యాచ్ ఫిబ్రవరి 23 జరుగుతుంది. భారత్, పాక్ గ్రూప్-ఏలో ఉన్నాయి. ఈ రెండు జట్లతో పాటు బంగ్లాదేశ్, న్యూజిలాండ్ సైతం గ్రూప్-లో ఉన్నాయి. టీమిండియా తన తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. ఆ తర్వాత 23న పాకిస్థాన్.. మార్చి 2న న్యూజిలాండ్‌తో ఆడుతుంది. టీమిండియా మూడు మ్యాచులు దుబాయిలోనే జరుగుతుంది. గ్రూప్-బీలో ఆఫ్ఘనిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. టీమిండియా ఆడే మ్యాచులు మినహా మిగతా.. గ్రూప్ మ్యాచులన్నీ లాహోర్, కరాచీ, రావల్పిండి స్టేడియాల్లో జరుగుతాయి. మార్చి 4, మార్చి 5 తేదీల్లో రెండు సెమీఫైనల్స్ ఉంటాయి. రెండు సెమీ ఫైనల్స్ రిజర్వ్ డే కేటాయించారు. మార్చి 9న జరిగే ఫైనల్స్‌కు రిజర్వ్ డే ఉంటుంది. తొలి సెమీ ఫైనల్ (భారత్ క్వాలిఫై అయితే) యూఏఈలో జరుగుతుంది. లేకపోతే పాక్‌లో జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ లాహోర్‌లో జరుగుతుంది. భారత్ ఫైనల్‌కు చేరితే మాత్రం దుబాయిలో జరుగుతుంది.
champions trophy schedule