Wimbledon : డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ (Carlos Alcaraz) వింబుల్డన్ టైటిల్ నిలబెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో నొవాక్ జకోవిచ్ (Novak Djokovic)ను చిత్తుగా ఓడించి రెండో ఏడాదిలోనూ చాంపియన్ అయ్యాడు. తొలి సెట్ నుంచి దూకుడుగా ఆడిన అల్కరాజ్.. నిర్ణయాత్మక మూడో సెట్లో మరింత చెలరేగాడు. 6-2, 6-2, 7-6 జకోను వణికించి ట్రోఫీ సొంతం చేసుకున్నాడు. దాంతో, సింగిల్స్‌లో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గాలనుకున్న జకో కల కలగానే మిగిలింది.
టోర్నీ ఆరంభం నుంచి అల్కరాజ్ అదరగొట్టాడు. సెమీఫైనల్లో డానిల్ మెద్వెదేవ్ (Daniil Medvedev)ను మట్టి కరిపించిన స్పెయిన్ స్టార్ ఆదివారం స్పెయిన్ కోర్టులో రఫ్ఫాడించాడు. ఆది నుంచి దూకుడుగా ఆడి తొలి సెట్ గెలుపొందాడు. అదే ఊపులో రెండో సెట్ గెలుపొంది జకోను ఒత్తిడిలో పడేశాడు.
To win here is special. To defend here is elite.
Carlos Alcaraz is the 2024 Gentlemen’s Singles Champion 🏆#Wimbledon pic.twitter.com/kJedyXf0vn
— Wimbledon (@Wimbledon) July 14, 2024
అయితే.. అనూహ్యంగా పుంజుకొన్న సెర్బియా ఆటగాడు గట్టి పోటీనివ్వడంతో మూడో సెట్హోరాహోరీగా సాగింది. కానీ, స్పెయిన్ స్టార్ పట్టువదలని యోధుడిలా పోరాడి జకో ట్రోఫీ ఆశలపై నీళ్లు చల్లాడు. టైటిల్ దక్కాలంటే సర్వశక్కులూ ఒడ్డాల్సిన పరిస్థితిలో.. చాంపియన్‌గా నిలిచాడు.
A familiar feeling 🤩
Carlos Alcaraz lifts the #Wimbledon Gentlemen’s Singles Trophy for the second time 👏 pic.twitter.com/O73owrPkk6
— Wimbledon (@Wimbledon) July 14, 2024
అనంతరం ప్రేక్షకులకు విజయాభివందనం చేసి.. విజిటర్స్ గ్యాలరీలోకి వెళ్లి తన టీమ్‌తో కలిసి సంబురాలు చేసుకున్నాడు. వింబుల్డన్ 2023 ఫైనల్లోనూ అల్కరాజ్ చేతిలో జకోవిచ్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. 21 ఏండ్ల వయసులోనే రెండో వింబుల్డన్ టైటిల్ గెలిచిన అల్కరాజ్ టెన్నిస్‌లో తన శకం మొదలైందని మరోసారి చాటాడు.
Astounding Alcaraz 🤩
The Spaniard defends his #Wimbledon title with a stunning straight sets victory over Novak Djokovic, 6-2, 6-2, 7-6(4) 🇪🇸 pic.twitter.com/bEbT9HwMZh
— Wimbledon (@Wimbledon) July 14, 2024
ప్రపంచ టె న్నిస్లో కొత్త స్టార్‌గా దూసుకొచ్చిన అల్కరాజ్కు ఇది నాలుగో గ్రాండ్‌స్లామ్ ఫైనల్. వింబుల్డన్‌లో అతడికి వరుసగా ఇది 13వ విజయం. అంతేకాదు గ్రాండ్‌స్లామ్స్‌లో 13వ విక్టరీ. ఈ ఏడాది అల్కరాజ్ విజయాల సంఖ్య 17-1.