వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసింది: నందమూరి బాలకృష్ణ
గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఇసుక, మద్యం అమ్మకాల్లో భారీ స్కామ్ జరిగిందని ఆరోపించారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.
గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఇసుక, మద్యం అమ్మకాల్లో భారీ స్కామ్ జరిగిందని ఆరోపించారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.
శ్రీసత్యసాయి జిల్లాలోని హిందూపురం రూరల్ పరిధిలోని కొటిపిలో అర్ధాంతరంగా నిలిచిపోయిన టిడ్కో ఇళ్లను ఆదివారం నాడు బాలకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు నెలల్లోనే టిడ్కో ఇళ్లు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కొత్త టెక్నాలజీతో బ్రిక్లెస్ ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఒక్కొక్క శాఖలో జరిగిన అవినీతి బయటపడుతోందని తెలిపారు. త్వరలో మరిన్ని శాఖల్లో జరిగిన అక్రమాలు బయటకు వస్తాయని అన్నారు. వైసీపీ నాయకులు వ్యవస్థలు అన్నింటినీ నాశనం చేశారని మండిపడ్డారు. ఇసుక, మద్యం, మైనింగ్‌లో కమీషన్ల కోసం అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. రిపాలన చేయడం చేతగాక మూడు రాజధానులు, నవరత్నాల పేరుతో మోసం చేశారని గత ప్రభుత్వాన్ని బాలకృష్ణ విమర్శించారు.
గతంలో హిందూరం ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది ఎన్టీఆర్ అని.. ఆయన ఆశయాలను కొనసాగిస్తానని బాలకృష్ణ తెలిపారు. హిందూపురం నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తానని చెప్పారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

