AP News | ముచ్చుముర్రి బాలిక ఘటనలో వీడని సస్పెన్స్.. కాల్వలోనే పడేశారా? పాతిపెట్టారా?
AP News | నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలిక హత్యాచార ఘటనపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. వారం రోజులు గడుస్తున్నా బాలిక ఆచూకీ ఇంకా తెలియడం లేదు. బాలికను చంపిన తర్వాత కాల్వలో పడేశామని మైనర్ బాలురు చెప్పడంతో సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టిన అధికారులు ఇప్పటివరకు బాలిక మృతదేహాన్ని కనిపెట్టలేకపోయారు.
AP News | నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలిక హత్యాచార ఘటనపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. వారం రోజులు గడుస్తున్నా బాలిక ఆచూకీ ఇంకా తెలియడం లేదు. బాలికను చంపిన తర్వాత కాల్వలో పడేశామని మైనర్ బాలురు చెప్పడంతో సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టిన అధికారులు ఇప్పటివరకు బాలిక మృతదేహాన్ని కనిపెట్టలేకపోయారు. ఈ క్రమంలో బాలిక మృతదేహం విషయంలో మైనర్ బాలురు, వాళ్ల తల్లిదండ్రులు చెబుతున్న మాటలు పలు అనుమానాలకు రేకెత్తిస్తున్నాయి.
ఈ నెల 7వ తేదీన పార్క్‌లో ఆడుకుంటున్న 8ఏళ్ల బాలికను ముగ్గురు మైనర్ బాలురు ఎత్తికెళ్లి అత్యాచారం చేశారు. అనంతరం చంపేసి మృతదేహం దొరక్కుండా చేశారు. అయితే బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేసి విచారించగా చంపిన తర్వాత కాల్వలో పడేశామని చెప్పారు. దీంతో పోలీసులు కాల్వలో వెతికించారు. కానీ మృతదేహం దొరకలేదు. ఆ తర్వాత శ్మశానంలో పాతిపెట్టామని చెప్పారు. ఎవరికీ అనుమానం రాకుండా స్పాట్లో క్షద్రపూజలు చేసిన ఆనవాళ్లను కూడా క్రియేట్ చేశారు. దీంతో నిందితులు చెప్పిన దాని ప్రకారం ముచ్చుముర్రితో పాటు కొణిదెల, వనములపాడు గ్రామాల్లోని శ్మశాన వాటికల్లోనూ తనిఖీలు చేపట్టారు. ఇదిలా ఉంటే తాజాగా మృతదేహాన్ని కృష్ణా నదిలో పడేశామని కూడా చెబుతున్నారు. దీంతో బాలిక మృతదేహం ఏమై ఉంటుందోనని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మృతదేహం దొరక్కపోవడంతో బాలిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ బిడ్డ మృతదేహాన్ని వీలైనంత త్వరగా అప్పగిస్తే దహన సంస్కారాలు చేసుకుంటామని విలపిస్తున్నారు. మైనర్లు కాబట్టి శిక్ష తగ్గించకూడదని.. కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించాలని కోరుతున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- AP News
- muchumarri
- murder
- Nandyala
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

