WTC Final : తొలి రోజు నుంచి ఊహించని మలుపులతో ఆసక్తి రేపుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ క్లైమాక్స్‌కు చేరింది. రెండు రోజులుగా ఆధిపత్యం చేతలు మారుతూ వచ్చిన పోరులో విజేత ఎవరో తేలిపోనుంది. తొలి ఇన్నింగ్స్‌లో 74 పరుగుల ఆధిక్యం సాధించిన ఆస్ట్రేలియా.. రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌తో మ్యాచ్‌పై పట్టు బిగించింది. సఫారీ పేసర్లు కబిసో రబడ(4-59), లుంగి ఎంగిడి(3-38)ల ధాటికి ప్రధాన బ్యాటర్లు పెవిలియన్ చేరినా.. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ(43), మిచెల్ స్టార్క్(58 నాటౌట్)ల అసమాన పోరాటంతో జట్టును ఆదుకున్నారు.
సఫారీ పేసర్లకు ఎదురొడ్డిన ఈ జోడీ రెండో పట్టుదలగా ఆడింది. మూడో రోజు లియన్(2)ను రబడ ఔట్ చేశాక హేజిల్‌వుడ్(17) జతగా స్కార్ట్ ప్రత్యర్థి బౌలర్లను విసిగించాడు. అజేయ అర్ధ శతకం బాదిన ఈ స్పీడ్‌స్టర్ పదో వికెట్‌కు 59 రన్స్ రాబట్టాడు. మరికాసేపట్లో లంచ్ అనగా ఈ ద్వయాన్ని.. మర్క్రమ్ విడదీశాడు. దాంతో, 207 వద్ద కంగారూ జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. తొలిసారి ఐసీసీ ట్రోఫీ కోసం నిరీక్షిస్తున్న దక్షిణాఫ్రికాకు విజయం కోసం 282 పరుగులు అవసరం. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్ మీద సఫారీ బ్యాటర్లు నింపాదిగా ఆడితే టెస్టు గదను ముద్దాడడం సాధ్యమేనంటున్నారు విశ్లేషకులు.
Australia add 63 runs to their overnight total – South Africa have a target of 282 to become World Test champions!#SAvAUS #WTCFinal pic.twitter.com/84MDHqOVeF
— ESPNcricinfo (@ESPNcricinfo) June 13, 2025
సెషన్ సెషన్‌కు ఆధిపత్యం మారతూ వస్తున్న ఫైనల్లో రెండో రోజు టీ సెషన్ తర్వాత దక్షిణాఫ్రికా (South Africa) పట్టుబిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో 138 ఆలౌటైన సఫారీ టీమ్.. అనంతరం బౌలర్ల విజృంభణతో ఆసీస్‌ను ఆలౌట్ అంచున నిలిపింది. పేస్‌కు అనుకూలిస్తున్న పిచ్ మీద కగిసో రబడ(2-15), లుంగి ఎంగిడి(3-35)లు కంగారూ బ్యాటర్లకు దడ పుట్టించారు. రబడ(4-59) ప్రత్యర్థిని ఆదిలోనే దెబ్బకొట్టాడు. డేంజరస్ ఉస్మాన్ ఖవాజా(6), కామెరూన్ గ్రీన్(0)లను ఔట్ చేసి కంగారూలకు షాకిచ్చాడు.
Breakthrough at the stroke of lunch! 💥 A brilliant grab by Maharaj, and Markram strikes; the Proteas finally close out the innings! 🇿🇦💪
Australia is bowled out for 207. South Africa now needs 282 runs to claim the ICC World Test Championship Mace. 🏆🔥 #WTCFinal #WozaNawe… pic.twitter.com/gV0IUUtkhx
— Proteas Men (@ProteasMenCSA) June 13, 2025
ఆ తర్వాత లుంగి ఎంగిడి(3-38) తన మ్యాజిక్ చూపిస్తూ స్టీవ్ స్మిత్(13)ను ఎల్బీగా వెనక్కి పంపాడు. కాసేపటికే మల్డర్ సూపర్ బాల్‌తో ట్రావిస్ హెడ్()ను బౌల్డ్ చేయగా..64కే ఐదో వికెట్ పడింది. వరుసగా వికెట్లు పడుతున్న జట్టును ఆదుకుంటాడనుకున్న కమిన్స్(6)ను ఎంగిడి బౌల్డ్ చేసి వాళ్ల కష్టాలను మరింత పెంచాడు. ఈ ఇద్దరి విజృంభణతో కమిన్స్ సేన ఒకదశలో 73కే ఏడు వికెట్లు కోల్పోయి.. మ్యాచ్‌ను చేజార్చుకునే ప్రమాదంలో పడింది.
Kagiso Rabada you have done what someone dreams of.
pic.twitter.com/8SvmG7z6nW— Lucifer (@LuciferCric) June 12, 2025
ప్రధాన ఆటగాళ్లంతా పెవిలియన్ చేరిన వేళ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ(43) ఒంటరిపోరాటం చేశాడు. మిచెల్ స్టార్క్(58 నాటౌట్)తో కలిసి జట్టును ఆదుకున్నాడు. కంగారూ జట్టు ఆధిక్యాన్ని 200కు పెంచిన క్యారీని రబడ ఔట్ చేసి 8వ వికెట్ అందించాడు. చివరి రెండు వికెట్లకు ఎక్కువ సమయం పట్టదని అనుకున్నారంతా. కానీ, స్టార్క్ అసమాన పోరాటంతో ఆకట్టుకున్నాడు. లియాన్(2) సైతం వికెట్‌ను కాపాడుకోగా ఆసీస్ ఆలౌట్ ప్రమాదం తప్పించుకుంది.
స్కార్ట్(58 నాటౌట్), హేజిల్‌వుడ్(17)
ఓవర్‌నైట్ స్కోర్ 144-8తో మూడో రోజు బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ను తొలి సెషన్ మొదలైన కాసేపటికే నాథన్ లియాన్(2)ను రబడ ఎల్బీగా ఔట్ చేశాడు. ఆ తర్వాత హేజిల్‌వుడ్(17)తో కలిసి మిచెల్ స్కార్ట్(58 నాటౌట్) జట్టు స్కోర్ 230 దాటించాడు. సఫారీ బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ.. బౌండరీలతో అలరించిన ఈ స్పీడ్‌స్టర్ అర్ధ శతకంతో ఆసీస్ ఆధిక్యాన్ని 280కి పెంచాడు. జిడ్డులా క్రీజును అంటుకుపోయిన ఈ ద్వయాన్ని మర్క్రమ్ విడదీయడంతో 207 వద్ద కమిన్స్ సేన ఇన్నింగ్స్ ముగిసింది.