WTC Final : ఆసక్తికర మలుపులు తిరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా (Australia) భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. ప్రధాన బ్యాటర్లు ఔటైనా మిచెల్ స్టార్క్ (58 నాటౌట్) ఒంటరి పోరాటంతో జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. మార్కో యన్సెన్ బౌలింగ్‌లో ఆఫ్ సైడ్ బౌండరీతో అర్దశతకం సాధించాడీ పేసర్. దాంతో, ఆసీస్ స్కోర్ 200 దాటింది.
మూడో రోజు తొలి సెషన్లోనే నాథన్ లియాన్(2)ను ఔట్ చేసిన దక్షిణాఫ్రికా బౌలర్లకు స్టార్క్, హేజిల్‌వుడ్ (17 నాటౌట్) జోడీ చుక్కలు చూపించింది. నింపాదిగా ఆడిన ఈ ఇద్దరూ సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్కోర్ బోర్డును నడిపించారు. క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీ ఆస్ట్రేలియా ఆధిక్యాన్ని 300లకు చేరువ చేసింది. ప్రస్తుతానికి ఆసీస్ 9 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. కమిన్స్ సేన 281 పరుగుల ఆధిక్యంలో ఉంది.