Rana Naidu Season 2 | విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ సీజన్ 2 తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, ఇంగ్లీష్ భాషల్లో ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులో ఉంది. అమెరికన్ సిరీస్ రే డోనవన్కి రీమేక్‌గా వచ్చిన ఫస్ట్ సీజన్ మంచి విజయాన్ని అందుకుంది. దీంతో దీనికి కొనసాగింపుగా రెండో సీజన్‌ను తీసుకువచ్చారు మేకర్స్.
కరణ్ అంశుమాన్, సుపర్ణ్ ఎస్. వర్మ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌లో సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, గౌరవ్ చోప్రా, ప్రియ బెనర్జీ, రాజేష్ జైస్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
The chaos begins.
Starring @VenkyMama and @RanaDaggubati in a power-packed return, #RanaNaidu Season 2 is now streaming on @NetflixIndia!
Bigger, better, and more explosive than ever 💥 💥 #RanaNaiduOnNetflix
@rampalarjun @krnx @Suparn @IncLocomotive @kriti_official pic.twitter.com/GyLBUWm4Ms— Suresh Productions (@SureshProdns) June 13, 2025