Vijaya Dairy | హైదరాబాద్ : సికింద్రాబాద్ లాలాపేట్‌లోని విజయ డెయిరీలో స్వల్ప ప్రమాదం సంభవించింది. బాదాం మిల్క్ కుక్కర్ ఎయిర్ పోకముందే తెరవడంతో అది గాల్లోకి ఎగిరి ప్రమాదం జరిగింది. దీంతో ఆపరేటర్ రవికి తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం నాచారం ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించారు. మహిళ సహా మరో ముగ్గురు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదంతో విజయ డెయిరీ ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు.