Team India : ఆసియా కప్ కోసం భారత బృందం దుబాయ్ చేరుకుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav), పేసర్ హార్దిక్ పాండ్యా, హెడ్‌కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir)లు గురువారం ఉదయం ముంబై విమానాశ్రయం నుంచి దుబాయ్‌కి బయలుదేరారు. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం వరకూ స్క్వాడ్‌లోని క్రికెటర్లు దుబాయ్‌లో సమావేశం కావాల్సి ఉంది. కానీ.. ఇప్పటికైతే కోచ్, కెప్టెన్, పాండ్యా మాత్రమే వెళ్లారు.
అనారోగ్యం నుంచి కోలుకుని.. ఫిట్నెస్ పరీక్ష ఎదుర్కొంటున్న వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేరుగా బెంగళూరు నుంచే దుబాయ్ వెళ్లనున్నాడు. దులీప్ ట్రోఫీలో ఆడుతున్న పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రానాలు, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా శుక్రవారంలోపు స్క్వాడ్‌తో కలుస్తారు. కోచింగ్ సిబ్బంది కూడా ఈరోజుకల్లా ఎడారి దేశం చేరుకోనున్నారు. స్క్వాడ్‌లోని అందరూ కలిశాక.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు వెళ్లనుంది టీమిండియా బృందం.
Off they go! ✈️
Team India captain @surya_14kumar and star all-rounder @hardikpandya7 have left for the Asia Cup 2025.
The mission? Bring the trophy home. 🏆🇮🇳
[Asia Cup 2025, Indian Cricket Team] pic.twitter.com/hYY7z6O0rc
— Star Sports (@StarSportsIndia) September 4, 2025
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ షురూ కానుంది. ఇప్పటివరకూ ఎనిమిది సార్లు (ఏడుసార్లు వన్డే ఫార్మాట్లో, ఒకసారి టీ20 ఫార్మాట్లో) ఆసియా ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియా తొమ్మిదో ట్రోఫీపై గురి పెట్టింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా బృందం సెప్టెంబర్ 4న దుబాయ్‌కు చేరుకోనుంది. తొలి పోరులో భాగంగా ఆతిథ్య యూఏఈతో తలపడనుంది. అనంతరం సెప్టెంబర్ 14న పాకిస్థాన్ జట్టును, సెప్టెంబర్ 19న పసికూన ఒమన్ టీమ్‌ను టీమిండియా ఢీకొట్టనుంది.
ఆసియా కప్ స్క్వాడ్ : సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), శుభ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రానా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.