Rohit Sharma : సిరీస్ సమం చేయాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్పిన్నర్లను ఎదుర్కోక భారత బ్యాటర్లు జట్టుకు ఘోర పరాజయాన్ని మిగిల్చారు. ఫలితంగా స్వదేశంలో 12 ఏండ్ల తర్వాత టీమిండియా (Team India) టెస్టు సిరీస్ కోల్పోయింది. స్పిన్ పిచ్‌ల మీద ఆడడం మనోళ్లకు కొట్టినపిండి అయినా.. పుణేలో మాత్రం ఆ పాచిక పారలేదు. ప్రత్యర్థి బ్యాటర్లు దంచేసిన చోట మనవాళ్లు చేలెత్తేయడం క్రికెట్ అభిమానులను అమితంగా బాధిస్తోంది. మూడో రోజే పుణే టెస్టులో చిత్తుగా ఓడడంపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) విచారం వ్యక్తం చేశాడు.
పుణేలో ఓటమిపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న హిట్‌మ్యాన్ మీడియాతో మాట్లాడాడు. ‘ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ గురించి ఇప్పుడే ఆలోచించడం తొందరపాటే. ఓటమితో చాలా నిరాశగా ఉంది. మేము అనుకున్న ఫలితం ఇది కాదు. మాకంటే బాగా ఆడిన న్యూజిలాండ్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందే. మ్యాచ్‌లో పట్టు సాధించే అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోలేదు. కివీస్ స్పిన్నర్ల సవాల్‌కు మేము దీటుగా స్పందించలేకపోయాం. స్కోర్‌బోర్డు మీద అవసరమైన పరుగులు చేసే దిశగా మా బ్యాటింగ్ సాగలేదు.
Rohit Sharma said “It’s too early to think about WTC (final). I’m hurting because we lost the game, we lost the series, it’s a collective failure from the bowlers as well as the batters
INDIA LOVE YOU ROHIT SHARMA pic.twitter.com/a9NsONJWcL
— Kuljot (@Kuljot__) October 26, 2024
మ్యాచ్ గెలవాలంటే 20 వికెట్లు తీయడం ముఖ్యమే. అదే సమయంలో బ్యాటర్లు కూడా స్కోర్ చేయాలి’ అని రోహిత్ అన్నాడు. ఒక దశలో అద్భుతంగా పోరాడినప్పటికీ మ్యాచ్ చేజార్చుకోవడం బాధగా ఉందని హిట్‌మ్యాన్ తెలిపాడు. ‘తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌ను 250 దాటకుండా కట్టడి చేశాం. 200-3తో ఉన్న ఆ జట్టును 259కే కట్టడి చేశాం. కానీ, మేము సరిగ్గా ఆడలేదు. రెండో ఇన్నింగ్స్‌లో ఆట మెరుగైనా అది సరిపోలేదు. సమిష్టి వైఫల్యంతో ఓడాం. చివరిదైన వాంఖడే టెస్టులో మా సత్తా చాటుతాం. ఉత్తమమైన ఆటతో ముంబైలో చెలరేగి విజయంతో సిరీస్‌ను ముగిస్తాం అని రోహిత్ వెల్లడించాడు.
ముచ్చటగా మూడోసారి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలనుకున్న భారత జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. సొంతగడ్డపై వరుసగా 18వ టెస్టు సిరీస్ విజయంతో జోరుమీదున్న టీమిండియా రికార్డుకు కివీస్ అడ్డుకట్ట వేసింది. బెంగళూరు టెస్టులో 46కే ఆలౌట్ అయిన టీమిండియా ఈసారి టర్నింగ్ పిచ్ మీద 156 పరుగులకే కుప్పకూలింది.
A tough loss for #TeamIndia in Pune.
Scorecard ▶️ https://t.co/YVjSnKCtlI #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/PlU9iJpGih
— BCCI (@BCCI) October 26, 2024
రెండో ఇన్నింగ్స్‌లోనైనా పోరాడి సిరీస్ సమం చేస్తుందనుకుంటే.. మిచెల్ సాంట్నర్(6/104) ధాటికి 245 పరుగులకే చాప చుట్టేసింది. స్వదేశంలో స్పిన్ ఉచ్చుతో ప్రత్యర్థులను బెంబేలెత్తించే భారత్.. ఈసారి అదే అస్త్రానికి తలవంచి సిరీస్‌ను న్యూజిలాండ్‌కు అప్పగించేసింది. దాంతో, స్వదేశంలో రోహిత్ సారథ్యంలోని భారత్ నాలుగు టెస్టు మ్యాచుల్లో ఓటమి చవిచూసింది. గత 12 ఏండ్లలో ఏ భారత సారథి కూడా ఇన్ని మ్యాచ్‌ల్లో పరాజయాన్ని చూడలేదు.
An unwanted record to Rohit Sharma’s name.
He has lost four Test matches as an Indian captain in the 21st century, the most by any Indian captain during this period. pic.twitter.com/ZwhZMO6sA1
— CricTracker (@Cricketracker) October 26, 2024