Bajaj Pulsar N125 | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ బజాజ్ ఆటో (Bajaj Auto) తన బజాజ్ పల్సర్ ఎన్125 మోటారు సైకిల్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. రెండు వేరియంట్లు – ఎల్ఈడీ డిస్క్, ఎల్ఈడీ డిస్క్ బీటీ వేరియంట్లలో లభిస్తుంది. ఎల్ఈడీ డిస్క్ వేరియంట్ రూ.94,707 (ఎక్స్ షోరూమ్), ఎల్ఈడీ డిస్క్ బీటీ వేరియంట్ రూ.98,707 (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. ఈ మోటారు సైకిల్ 124.58సీసీ, ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 12 హెచ్‌పీ విద్యుత్, 11 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 5-స్పీడ్ గేర్ బాక్స్ కలిగి ఉంటుంది. ఫ్యుయల్ ట్యాంకు 9.5 లీటర్ల కెపాసిటీతో వస్తుంది. ఫ్రంట్‌లో టెలిస్కోపిక్ ఫోర్క్, రేర్‌లో మోనోషాక్, ఫ్రంట్‌లో 240ఎంఎం డిస్క్ బ్రేక్, 130 ఎంఎం రేర్ డ్రమ్ బ్రేక్ ఉంటాయి వేరియంట్ల వారీగా న్యూ బజాజ్ పల్సర్ ఎన్ 125 మోటారు సైకిల్ ఫీచర్ల గురించి తెలుసుకుందామా..!
బజాజ్ న్యూ పల్సర్ ఎన్125 బేస్ వేరియంట్ మోటారు సైకిల్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, డిస్క్ బ్రేకులతో వస్తుంది. ఓడోమీటర్, ట్రిప్ మీటర్, న్యూట్రల్ ఇండికేటర్ మాదిరిగా టెల్ టేల్ సైన్స్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సైడ్ స్టాండ్, ఫ్యుయల్ గేజ్, సెల్ఫ్ స్టార్టర్ విత్ ఆప్షనల్ కిక్ స్టార్టర్ ఉంటాయి. ఎబోనీ బ్లాక్, కాక్ టెయిల్ వైన్ రెడ్, పెరల్ మెటాలిక్ వైట్, కరేబియన్ బ్లూ రంగుల్లో లభిస్తాయి.
బజాజ్ పల్సర్ ఎన్125 ఎల్ఈడీ డిస్క్ బీటీ వేరియంట్ మోటారు సైకిల్ బ్లూ టూత్ కనెక్టివిటీ ఉంటుంది. దీనివల్ల కాల్, మెసేజ్ అలర్ట్ పొందొచ్చు. క్లచ్ ప్రెస్ చేసి మోటార్ సైకిల్ స్టార్ట్ చేయడానికి వీలుగా ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ (ఐఎస్జీ) ఉంటుంది. త్రీ డ్యుయల్ టోన్ షేడ్స్ లో లభిస్తుందీ బైక్. ఎబోనీ బ్లాక్ విత్ కాక్ టెయిల్ వైన్ రెడ్, ఎబోనీ బ్లాక్ విత్ పర్పుల్ ఫరీ, ప్యూటర్ గ్రే విత్ సిట్రస్ రష్ రంగుల్లో లభిస్తుంది.