అమరావతి : ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandra Babu), ఎమ్మెల్యే బాలకృష్ణ(Balakrishna) అన్‌స్టాపబుల్‌గా(Unstappble) అబద్దాలు ఆడారని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి మేరుగు నాగార్జున (Merugu Nagarjuna) ఆరోపించారు. శనివారం తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బావ, బామ్మర్దిలిద్దరూ అలవాటుగా అబద్దమాడారని విమర్శించారు.
సానుభూతి, ప్రచారం కోసం ఇద్దరు నాటకాలు ఆడారని విమర్శించారు. ప్రజలను మోసం చేసి రాజకీయాలు చేయడమే వారి నైజమని ఆరోపించారు. ట్రూ ఆఫ్ చార్జీల(True of Charges) పేరిట రాష్ట్రప్రజలపై రూ. 6వేల కోట్ల భారాన్ని నవంబర్ 1 నుంచి మోపనున్నారని వెల్లడించారు. నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయని అన్నారు. పంటల ఉచిత బీమాను (Crop Insurance) ఎత్తేసి వ్యవసాయాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
గతంలో విద్యుత్(Power) వాడకపోయినా బిల్లులు వసూలు చేసిన చరిత్ర చంద్రబాబుకు ఉందని ఆరోపించారు. హామీలిచ్చి తప్పించుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని విమర్శించారు. కడపలో ఏర్పాటుచేసిన సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అవినాష్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ హయాంలో రైతు భరోసా ద్వారా రైతులకు అన్ని రకాల సౌకర్యాలు అందించామన్నారు. కూటమి ప్రభుత్వం పంట బీమాను రైతులే కట్టుకోవాలని పేర్కొనడం దారుణమన్నారు.