న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి.. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలోనే కొనసాగుతున్నారు. మహిళల సింగిల్స్‌లో రెండు ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు రెండు స్థానాలు మెరుగు పర్చుకొని 15వ ర్యాంక్‌కు చేరుకుంది.
పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్ 9వ ప్లేస్‌లో, లక్ష్యసేన్ 11వ ర్యాంక్‌లో ఉన్నారు. కిడాంబి శ్రీకాంతో ఓ ర్యాంక్ చేజార్చుకొని 20వ ప్లేస్‌లో నిలిచాడు. యువ షట్లర్ ప్రియాన్షు రజావత్ 28వ స్థానానికి దూసుకొచ్చాడు. గాయత్రి-త్రిసా జాలీ జోడీ 19వ ర్యాంక్‌లో ఉంది.