Jos Buttler : తొడ కండరాల గాయం నుంచి కోలుకున్న ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ (Jos Buttler) పునరాగమనం చేయబోతున్నాడు. రెండు నెలలకు పైగా జట్టుకు దూరమైన ఈ డాషింగ్ బ్యాటర్ వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు. కరీబియన్ జట్టుతో తొలి టీ20కి ముందు బట్లర్ మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయం పంచుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో భారత జట్టు చేతిలో ఓటమి అనంతరం తనపై వేటు పడుతుందని, కెప్టెన్సీ కూడా పోతుందని భయపడ్డానని బట్లర్ అన్నాడు.
‘ఒకానొక దశలో బోర్డు, సెలెక్టర్లు నన్ను కెప్టెన్‌గా తప్పిస్తారేమోనని భయపడ్డాను. టీ20 వరల్డ్ కప్ ముగిశాక నాపై వేటు పడడం ఖాయం అనిపించింది. ఎందుకంటే.. ఇంగ్లండ్ వన్డే, టీ20 జట్టు వైఫల్యానికి కారణాలపై టీమ్ డైరెక్టర్ రాబిన్ కీ (Robin Key) చాలా లోతుగా అధ్యయనం చేశాడు. ఆ సమయంలో నాకు భయం వేసింది. ఇంకేముంది నన్ను కెప్టెన్‌గా తొలగిస్తారు? అని మనసులో చాలా ఆందోళన చెందాను’ అని బట్లర్ వివరించాడు. పొట్టి వరల్డ్ కప్ అనంతరం టీమ్ డైరెక్టర్ రాబిన్ కీతో చాలాసేపు మాట్లాడానని బట్లర్ చెప్పాడు.
❎ “I was aware that he may want to go in a different direction, but I was never doubting whether I’d want to do it.”
Jos Buttler discusses moving forwards after the T20 World Cup in the summer 💪#WIvENG is live on @talkSPORT2 from 7:30pm tomorrow evening 🏏 pic.twitter.com/zShciaiken
— talkSPORT Cricket (@Cricket_TS) November 8, 2024
‘వైట్‌బాల్ క్రికెట్లో ఇంగ్లండ్‌ను సమర్ధంగా నడిపించగల కెప్టెన్ నేను అని, ఆ నమ్మకం నాకు ఉందని రోబికి తెలిపాను. అందుకు ఆయన కూడా అవును అన్నట్టు తలూపాడు. రాబోయే రోజుల్లో ఇంగ్లండ్‌ను విజయాల బాట పట్టించి.. పూర్వ వైభవం తీసుకురాగల సామర్ధ్యం నాకుందని రాబిన్ అనుకున్నాడు’ అని బట్లర్ వెల్లడించాడు. వెస్టిండీస్, ఇంగ్లండ్‌ల మధ్య ఐదు టీ20ల సిరీస్ నవంబర్ 10న మొదలవ్వనుంది.
ఇయాన్ మోర్గాన్ వారసుడిగా వైట్‌బాల్ కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న బట్లర్ జట్టుపై తన ముద్ర వేశాడు. 2022లో ఆస్ట్రేలియా ఆతిథ్యమిచ్చిన టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌ను చాంపియన్‌గా నిలిపాడు. ఉత్కంఠ రేపిన ఫైనల్లో పాకిస్థాన్‌పై గెలుపొందిన ఇంగ్లండ్ రెండోసారి పొట్టి కప్‌ను ముద్దాడింది.
అనంతరం భారత్ వేదికగా సాగిన వన్డే వరల్డ్ కప్‌లో బట్లర్ సేన విఫలమైంది. ఇక వెస్టిండీస్, అమెరికాలు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన టీ20 వరల్డ్ కప్‌లోనూ ఇంగ్లండ్ తడబడింది. వరుస ఓటముల తర్వాత పుంజుకొని సెమీఫైనల్‌కు దూసుకొచ్చింది. అయితే.. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ధాటికి నిలువలేక డిఫెండింగ్ చాంపియన్ ఇంటిదారి పట్టింది.