ENG vs USA : సూపర్ 8 లోచావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ (England) సూపర్ విక్టరీ కొట్టింది. బార్బడోస్‌లో అమెరికాను అల్లాడించిన బట్లర్ సేన 10 వికెట్లతో గెలుపొంది దర్జాగా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. తొలుత క్రిస్ జోర్డాన్(4/10) హ్యాట్రిక్‌తో విజృంభించగా.. అనంతరం ఓపెనర్ జోస్ బట్లర్(83 నాటౌట్) సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. సిక్సర్‌తో హాఫ్ సెంచరీ బాదిన ఇంగ్లండ్ సారథి.. వరుస పెట్టి బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు. దాంతో, 10 ఓవర్లలోనే 115 పరుగులను ఊదేసిన ఇంగ్లండ్ గ్రూప్ 2 నుంచి సెమీస్ బెర్తు ఖారారు చేసుకుంది.
పొట్టి ప్రపంచ కప్ సూపర్ 8 ఆఖరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చాంపియన్ ఆటతో చెలరేగింది. పసికూన అమెరికాకు మర్చిపోలేని ఓటమిని అందిస్తూ సెమీస్‌లోకి దూసుకెళ్లింది. 115 పరుగుల ఛేదనలో జోస్ బట్లర్(83 నాటౌట్ : 38 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లు) కెప్లెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఓపెన్ ఫిలిప్ సాల్ట్(25 నాటౌట్) సైతం దూకుడుగా ఆడడంతో 9.4 ఓవర్లలోనే ఇంగ్లండ్ జయభేరి మోగించింది.
England become the first team to qualify for the #T20WorldCup 2024 semi-finals 🤩
A formidable all-round performance as they brush aside USA in Barbados 🔥#T20WorldCup | #USAvENG | 📝: https://t.co/TvtiqrOfcc pic.twitter.com/ILWZQhaEjI
— ICC (@ICC) June 23, 2024
టాస్ గెలిచిన బట్లర్ అమెరికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.అతడి అంచాలన్నినిజం చేస్తూ బౌలర్లు అదరగొట్టారు. పేసర్ క్రిస్ జోర్డాన్(4/10) హ్యాట్రిక్‌తో ఆతిథ్య అమెరికాను కుప్పకూల్చాడు. 19వ ఓవర్లో ఏకంగా నాలుగు వికెట్లు తీసి వారెవ్వా అనిపించాడు. స్పిన్నర్ ఆదిల్ రషీద్ రెండు వికెట్లతో మెరిశాడు. ఇక అమెరికా జట్టులో నితీశ్ కుమార్(30), కొరే అండర్సన్(39)లు మాత్రమే పర్వాలేదనిపించారు. దాంతో, యూఎస్ఏ నిర్ణీత ఓవర్లలో 115 పరుగులు చేసింది.
A sensational HAT-TRICK 💥
Chris Jordan nips out three USA batters in three deliveries and brings up his @MyIndusIndBank Milestone moment 👏#T20WorldCup | #USAvENG | 📝: https://t.co/wNQ1pl3vcI pic.twitter.com/DRotMYtaLG
— ICC (@ICC) June 23, 2024