Vivo T3 Lite | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో.. మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ వివో టీ3 లైట్ (Vivo T3 Lite)ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించేందుకు ముహూర్తం ఖరారు చేసింది. దీని ధర రూ.12 వేల లోపే ఉంటుందని భావిస్తున్నారు .ఈ నెల 27 మధ్యాహ్నం 12 గంటలకు భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తారు. బ్లాక్, గ్రీన్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభిస్తుందని తెలుస్తున్నది.మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్వోసీ చిప్ సెట్ తో పని చేస్తుందీ వివో టీ3 లైట్ ఫోన్. 50 మెగా పిక్సెల్ సోనీ ఏఐ మెయిన్ రేర్ కెమెరా, సెకండరీ కెమెరాతోపాటు సెల్ఫీలూ వీడియో కాలర్స్ కోసం ఫ్రంట్ కెమెరా ఉంటుందని భావిస్తున్నారు.
వివో ప్రధానంగా మిడ్ రేంజ్ ధర అంటే రూ.15 వేల లోపు ధరల్లో గల స్మార్ట్ ఫోన్ల ఆవిష్కరణపైనే దృష్టిని కేంద్రీకరించిందని తెలుస్తోంది. ఇంతకుముందు వివో టీ3ఎక్స్ ఫోన్ ఆవిష్కరించింది. తాజాగా ఆవిష్కరించనున్న వివో టీ2 లైట్ ఫోన్ రియల్మీ నార్జో 70ఎక్స్, పోకో ఎం6 ప్రో, రెడ్మీ 13సీ, మోటో జీ34, త్వరలో ఆవిష్కరించనున్న రెడ్మీ 13 5జీ ఫోన్లకు పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, హెచ్డీఆర్10 + , 1800 పీక్ బ్రైట్ నెస్, 2400×1080 పిక్సెల్స్ రిజొల్యూషన్ తో 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ ప్లే ఉంటుందని తెలుస్తోంది.