Road Accident | రంగారెడ్డి జిల్లా నార్సింగీ ఔటర్ రింగు రోడ్డుపై ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రైవేటు ట్రావెల్ బస్సు ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ప్రమాదంలో పది మందికి గాయాలయాయి. బస్సు చక్రాల కిందపడడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ వెంటనే ఆసుపత్రికి తరలించారు. బస్సు బోల్తాపడడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దాదాపు రెండు కిలోమీటర్లకుపైగానే ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రమాదం జరిగిన బస్సు మార్నింగ్ స్టార్ ట్రావెల్‌కు చెందిన బస్సుగా తెలుస్తున్నది. హైదరాబాద్ నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు మీదుగా ముంబయికి వెళ్తున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్రేన్ సహాయంతో రోడ్డుపై నుంచి బస్సును తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.