IND vs UAE : ఆసియా కప్ తొలి మ్యాచ్లో భారత బౌలర్ల ధాటికి యూఏఈ బ్యాటర్లు పెవిలియన్ చేరుతున్నారు. మొదట ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఓపెనర్ అలీషాన్ షరుఫు(22)ను ఔట్ చేసి జట్టుకు తొలి వికెట్ అందించాడు. దూకుడుగా ఆడుతున్న అతడిని యార్కర్ కింగ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో.. 26వద్ద ఆతిథ్య జట్టు మొదటి వికెట్ కోల్పోయింది. కాసేపటికే బంతి అందుకున్న వరుణ్ చక్రవర్తి ముహమ్మద్ జొహైబ్(2)ను డగౌట్ చేర్చాడు. ప్రస్తుతం కెప్టెన్ ముహమ్మద్ వసీం(16), రాహుల్ చోప్రా(0)లు క్రీజులో ఉన్నారు. పవర్ ప్లేలో యూఏఈ స్కోర్.. 41/2.
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ మైదానంలో యూఏఈ జట్టుతో టీమిండియా తలపడుతోంది. టాస్ గెలిచిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రత్యర్థిని బ్యాటింగ్కు ఆహ్వానించాడు. అయితే.. ఓపెనర్లు ధనాధన్ ఆటతో ఇన్నింగ్స్ ఆరంభించారు. హార్దిక్ పాండ్యా వేసిన తొలి ఓవర్లో అలీషాన్ షరుఫు(22) రెండు ఫోర్లు బాదాడు.
It’s Jasprit Bumrah and it’s a Timber Strike ⚡️
First success with the ball for #TeamIndia! 👏 👏
Follow The Match ▶️ https://t.co/Bmq1j2LGnG#AsiaCup2025 | #INDvUAE | @Jaspritbumrah93 pic.twitter.com/q2S0iTg6iE
— BCCI (@BCCI) September 10, 2025
అనంతరం అక్షర్ పటేల్ ఓవర్లో కవర్స్ దిశగా సిక్సర్ సాధించాడు. దంచికొడుతున్న అతడిని బుమ్రా బౌల్డ్ చేసి యూఏఈ పరుగుల వేగానికి అడ్డుకట్ట వేశాడు. ఆ తర్వాతి ఓవర్లో వరుణ్ చక్రవర్తి తన స్పిన్ మ్యాజిక్ చూపిస్తూ ముహమ్మద్ జొహైబ్(2)ను పెవిలియన్ పంపాడు. అంతే.. యూఏఈ జట్టు పవర్ ప్లేలోనే కష్టాల్లో పడింది.