IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో ఆలస్యంగా అడుగుపెట్టిన జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) రికార్డులు బద్ధలు కొడుతున్నాడు. యార్కర్లతో బెంబేలెత్తిస్తున్న ఈ స్పీడ్‌స్టర్ ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పాడు. తనకు మెంటార్, గురువు అయిన లసిత్ మలింగ(Lasith Malinga)ను వెనక్కి నెట్టాడీ పేస్ గుర్రం. తద్వారా ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు.
వాంఖడేలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బుమ్రా ఈ ఫీట్ సాధించాడు. లక్నో ఓపెనర్ ఎడెన్ మర్క్రమ్ను ఔట్ చేసి.. 171 వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. దాంతో, మలింగ రెండో స్థానానికి పడిపోయాడు. తన వైవిధ్యమైన బౌలింగ్ యాక్షన్‌తో బ్యాటర్లను వణికించే బుమ్రా 2013 నుంచి నుంచి ముంబైకి ఆడుతున్నాడు. మలింగతో కలిసి ఆడిన ఈ పేసర్ ఇప్పుడు అతడి రికార్డును బ్రేక్ చేశాడు.
Jasprit Bumrah now has the MOST wickets for Mumbai Indians, surpassing Lasith Malinga (170) 🐐#MIvLSG LIVE: https://t.co/RhpVPVsTuU pic.twitter.com/VAj2Gdc33Z
— ESPNcricinfo (@ESPNcricinfo) April 27, 2025
ఐపీఎల్లో ముంబైకి ఆడిన బౌలర్లలో అత్యధిక వికెట్లు తీసిన వాళ్లలో స్పిన్నర్ హర్భజన్ సింగ్, కరీబియన్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్‌లు ఉన్నారు. ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యా(Hardik Pandya) సైతం ముంబై తరఫున 60కి పైగా వికెట్లు పడగొట్టాడు.
1. జస్ప్రీత్ బుమ్రా – 171 వికెట్లు
2. లసిత్ మలింగ -170 వికెట్లు
3. హర్భజన్ సింగ్ 127 వికెట్లు
4. మిచెల్ మెక్క్లెనగన్ 71 వికెట్లు
5. కీరన్ పొలార్డ్ 69 వికెట్లు
6. హార్దిక్ పాండ్యా 65 వికెట్లు