Jaspirt Bumrah : ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా కితాబులందుకుంటున్న భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jaspirt Bumrah) పెర్త్ టెస్టులో విశ్వరూపం చూపించాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లను క్రీజులో నిలవకుండా చేసి ఐదు వికెట్లతో గర్జించాడు. దాంతో, విదేశాల్లో అత్యధిక పర్యాయాలు 5 వికెట్లు పడగొట్టిన భారత రెండో బౌలర్‌గా బుమ్రా రికార్డు నెలకొల్పాడు. 1983 వరల్డ్ కప్ కెప్టెన్, లెజెండరీ ఆటగాడు అయిన కపిల్ దేవ్ (Kapil Dev) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
పెర్త్‌లో నిప్పులు చెరిగిన బుమ్రా కెరీర్లో 11వ సారి ఐదు వికెట్ల ప్రదర్శన కనబరిచాడు. విదేశాల్లో అతడు ఇలా విజృంభించడం ఇది తొమ్మిదోసారి. దాంతో, ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్(James Anderson), దక్షిణాఫ్రికా మాజీ పేసర్ అలెన్ డొనాల్డ్ (Allan Donald)లను యార్కర్ కింగ్ అధిగమించాడు. జిమ్మీగా పేరొందిన అండర్సన్ 8 సార్లు విదేశీ గడ్డపై ఐదు వికెట్లు నేలకూల్చగా.. డొనాల్డ్ సైతం అన్నేసార్లు ఐదు వికెట్లతో రాణించాడు.
Jasprit Bumrah meets Kapil Dev at the top 🗻
For more stats 👉 https://t.co/2yOb5gkYv5 pic.twitter.com/1AgamzSlaJ
— ESPNcricinfo (@ESPNcricinfo) November 23, 2024
విదేశాల్లో అత్యధికంగా ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన వాళ్లలో న్యూజిలాండ్ దిగ్గజం రిచ్చర్డ్ హడ్లీ(21), ఆస్ట్రేలియా లెజెండరీ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్(18), పాకిస్థాన్ మాజీ పేసర్ వసీం అక్రమ్(17)లు తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. భారత పేసర్లలో ఇషాంత్ శర్మ 9 పర్యాయాలు, జహీర్ ఖాన్ ఎనిమిదిసార్లు ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.
రోహిత్ శర్మ గైర్హాజరీలో పెర్త్ టెస్టుకు టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న బుమ్రా జట్టును ముందుండి నడిపించాడు. బౌలింగ్‌లో సత్తా చాటిన యార్కర్ కింగ్ ఆసీస్ ఓపెనర్లు సహా మిడిలార్డర్‌ను డగౌట్ పంపి తొలి రోజే 4 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఇక రెండో రోజు తొలి బంతికే అలెక్స్ క్యారీని ఔట్ చేసి ఐదు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అరంగేట్ర పేసర్ హర్షిత్ రానా(348) ఓ చేయి వేయగా ఆతిథ్య జట్టు 104 పరుగులకే కుప్పకూలింది.
The skipper strikes with his FIRST ball of the day, and he now has a five-for in Perth 🔥https://t.co/FIh0brrijR #AUSvIND #JaspritBumrah pic.twitter.com/uUUAxcTs9t
— ESPNcricinfo (@ESPNcricinfo) November 23, 2024
అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు భారీ స్కోర్ దశగా దూసుకెళ్తోంది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(90 నాటౌట్), కేఎల్ రాహుల్(62 నాటౌట్)లు తొలి వికెట్‌కు అజేయంగా 172 పరుగులు జోడించగా.. టీమిండియా 218 రన్స్ ఆధిక్యంలో ఉంది. మూడోరోజు లీడ్ 300 దాటిందంటే.. కంగారూ బ్యాటర్లకు ఇక కష్టకాలమే. ఆల్‌రౌండ్ షోతో పెర్త్ టెస్టులో పట్టుబిగించిన భారత జట్టు ప్రతిష్ఠాత్మక బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో బోణీ కొట్టడం దాదాపు ఖాయమైనట్టే అనిపిస్తోంది.