IND BAN 1st Test : చెపాక్ స్టేడియంలో భారత బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్(Bangladesh) విలవిలలాడింది. టీమిండియా పేసర్ల విజృంభణకు నిలువలేక ఒకటిన్నర సెషన్లోనే చాప చుట్టేసింది. జస్ప్రీత్ బుమ్రా(4/50), మహ్మద్ సిరాజ్(2/30) బుల్లెట్ బంతులను ఎదుర్కోలేక 149 పరుగులకు ఆలౌటయ్యింది. దాంతో, టీమిండియాకు 227 పరుగుల ఆధిక్యం లభించింది. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ సేన 376 పరుగులు కొట్టిన విషయం తెలిసిందే.
పాకిస్థాన్‌పై టెస్టు సిరీస్ విజయంతో భారత్‌కు వచ్చిన బంగ్లాదేశ్ బ్యాటర్లు తొలి మ్యాచ్‌లోనే తడబడ్డారు. బుమ్రా(4/50), ఆకాశ్ దీప్(2/19)ల పేస్‌ను ఎదుర్కోలేక నానా తంటాలు పడ్డారు. బంగ్లా జట్టులో ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ 32 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టెయిలెండర్ నహిద్ రానా(11)ను సిరాజ్ బౌల్డ్ చేయడంతో 149 వద్ద బంగ్లా ఇన్నింగ్స్‌కు తెరపడింది.
Jasprit Bumrah picks up four wickets, and Bangladesh have been bowled out for 149!
India will bat again in Chennai, leading by 227 runs 👉 https://t.co/hBUP43TiZJ #INDvBAN pic.twitter.com/h9AMxeWsUS
— ESPNcricinfo (@ESPNcricinfo) September 20, 2024
టీమిండియాను రెండో రోజు తొలి సెషన్లోనే ఆలౌట్ చేసిన బంగ్లాదేశ్‌కు ఆ ఆనందం ఎక్కువ సేపు నిలువలేదు. బుమ్రా తన తొలి స్పెల్‌లోనే ఓపెనర్ షద్నమ్ ఇస్లాం(2)ను బౌల్డ్ చేసి పర్యాటక జట్టుకు షాకిచ్చాడు. బుమ్రా ఓవర్లో వికెట్ కాపాడుకుంటే చాలనుకున్న బంగ్లా టాపార్డర్‌ను దులీప్ ట్రోఫీ హీరో ఆకాశ్ దీప్ దెబ్బకొట్టాడు. 9వ ఓవర్లో వరుస బంతుల్లో జకీర్ హసన్(3), మొమినుల్ హక్(0)లను బౌల్డ్ చేసి బంగ్లాను కష్టాల్లోకి నెట్టాడు. 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన బంగ్లాను కెప్టెన్ నజ్ముల్ హుసేన్ శాంటో(20) ఆదుకునే ప్రయత్నం చేశాడు.
Akash Deep rattles the stumps TWICE before lunch 🎯
Bangladesh are 26/3, trailing by 350 runs 👉 https://t.co/hBUP43TiZJ #INDvBAN pic.twitter.com/hYgSTSVqC6
— ESPNcricinfo (@ESPNcricinfo) September 20, 2024
కానీ, సిరాజ్ అతడిని బోల్తా కొట్టించి పర్యాటక జట్టును పీకల్లోతు కష్టాల్లో పడేశాడు. ఆ దశలో ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్(32), లిట్టన్ దాస్(22)లు కీలక ఇన్నింగ్స్ ఆడారు. బుమ్రా, ఆకాశ్ దీప్ ఓవర్లో వికెట్ కాపాడుకొని స్కోర్ బోర్డును నడిపించారు. అయితే.. జడేజా ఈ ఇద్దరిని పెవిలియన్ పంపి బంగ్లాదేశ్ ఆశలపై నీళ్లు చల్లాడు. చివర్లో మెహిదీ హసన్ మిరాజ్(27నాటౌట్), నహిద్ రానా(11) లు కాసేపు పోరాడి పరువు కాపాడారు.
తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 376 పరుగుల చేసింది. బంగ్లాదేశ్ యువ పేసర్ హసన్ మహ్ముద్ నిప్పులు చెరగడంతో టాపార్డర్‌లో యశస్వీ జైస్వాల్(56) మినహా ఏ ఒక్కరూ రాణించలేదు. ఒకదశలో 144 పరుగులకే ఆరు వికెట్లు పడ్డాయి. ఆ దశలో రవిచంద్రన్ అశ్విన్(113), రవీంద్ర జడేజా(86)లు అసమానం పోరాటం కనబరిచారు.
అశ్విన్(113), రవీంద్ర జడేజా(86)
బంగ్లా బౌలర్ల ఉత్సాహాన్ని నీరుగారుస్తూ బౌండరీలతో చెలరేగారు. దూకుడగా ఆడిన అశ్విన్ 108 బంతుల్లోనే శతకం సాధించాడు. జడేజాతో కలిసి అజేయంగా 195 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే.. రెండో రోజు ఉదయం తస్కిన్ అహ్మద్(3/55) మూడు వికెట్లతో విజృంభించడంతో టీమిండియా 376 పరుగులకే పరిమితమైంది.