పాట్నా: మహిళా నాయకురాలిపై ఆ పార్టీకి చెందిన నేత తన మద్దతుదారులతో కలిసి దాడి చేశాడు. మెడలో చెప్పుల దండ వేసి ఉరేగించాడు. తీవ్రంగా గాయపడిన ఆ మహిళ ఆసుపత్రిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ నేతను అరెస్ట్ చేశారు. (JDU Woman Leader Thrashed) బీహార్‌లో అధికారంలో ఉన్న సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూలో ఈ సంఘటన జరిగింది. సీతామర్హి జిల్లాలోని బైర్గానియా బ్లాక్‌లో బుధవారం జేడీయూ కార్యక్రమం జరిగింది. అయితే ఆ పార్టీ మహిళా సెల్ జిల్లా అధ్యక్షురాలు కామిని పటేల్‌ను దీనికి ఆహ్వానించలేదు. ఈ నేపథ్యంలో ఆమెతో పాటు మరికొందరు ఫేస్బుక్లో కామెంట్లు చేశారు.
కాగా, గురువారం ఉదయం ఈ అంశంపై చర్చించేందుకు వార్డు కౌన్సిలర్ సంజయ్ సింగ్ ఇంటికి కామిని పటేల్ వెళ్లింది. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో వార్డు కౌన్సిలర్ మద్దతుదారులు కామినిని చుట్టుముట్టి కొట్టారు. ఆమెను దొంగగా ఆరోపించారు. మెడలో చెప్పుల దండ వేసి వార్డు కౌన్సిలర్ నివసించే వీధిలో ఊరేగించారు.
మరోవైపు అపస్మారక స్థితిలో ఉన్న కామిని పటేల్‌ను తొలుత స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అందించిన డాక్టర్లు మెరుగైన చికిత్స కోసం ముజఫర్‌పూర్‌లోని ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి రిఫర్ చేశారు.
కాగా, కామిని పటేల్ ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. జేడీయూ నేత, వార్డు కౌన్సిలర్ సంజయ్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే జేడీయూ మహిళా నాయకురాలిని కొట్టి, మెడలో చెప్పుల దండ వేసి ఆమెను ఊరేగించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
फेसबुक पर राजनीतिक बयानबाजी के बाद मामूली विवाद के तूल पकड़ने पर जदयू के सीतामढ़ी जिला महिला इकाई की अध्यक्ष कामिनी पटेल की चप्पल से पिटाई, गले में चप्पल की माला. बिहार में बहार है. pic.twitter.com/QYxRVFVLa9
— Bishnu K Jha (@bisnujha) September 20, 2024