ఢాకా: పాకిస్థాన్, బంగ్లాదేశ్ తొలి టెస్టు సందర్భంగా మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న ‘ఫాక్స్ 501 హెచ్డీ’ చానల్ ఘోర తప్పిదం చేసి నవ్వులపాలైంది. రెండో రోజు ఆట ప్రారంభమవగానే పాక్ తుది జట్టు స్థానంలో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఆటగాళ్ల పేర్లను చూపించింది.
అందులో ఇంకా టెస్టు అరంగేట్రం చేయని తిలక్, శివం దూబే పేర్లు కూడా ఉండటంతో నెటిజన్లు సదరు చానెల్‌ను ఓ ఆటాడుకున్నారు. ఈ మ్యాచ్‌లో బంగా తొలి ఇన్నింగ్స్‌లో 413 పరుగులకు ఆలౌటైంది. తర్వాత పాక్ 179/1తో రెండో రోజు ముగించింది.