వాల్‌పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఈ నెల 26న బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ కాంక్లేవ్ జరుగనుంది. దీనికి సంబంధించిన వాల్‌పోస్టర్, స్పోర్ట్స్ క్యాంపెయిన్ వాహనాన్ని క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట వేస్తున్నాం. సీఎం కేసీఆర్ క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహానికి తగ్గట్లు అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ఫలితాలు వస్తున్నాయి’ అని అన్నారు. ఈ నెల 22 వరకు బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యలో వివిధ క్రీడా అకాడమీలు, పాఠశాలల్లో ‘బాడీ అండ్ మైండ్- ఫిట్ అండ్ ఫైండ్’ పేరుతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారీస్ డైరెక్టర్ బీకే కుల్దీప్ దీదీ, స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మి, స్పోర్ట్స్ కో ఆర్డినేటర్లు వసంత, వంశీధర్ పాల్గొన్నారు.