కరాచీ : ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై బహిష్కరణ వేటు వేసినందుకు నిరసనగా ఈ టోర్నీని బాయ్‌కాట్ చేస్తామని బీరాలు పోయిన పాకిస్థాన్‌ది మేకపోతు గాంభీర్యమే అని తేలిపోయింది. వరల్డ్ కప్ కోసం ఇప్పటికే జట్టును ప్రకటించిన ఆ జట్టు.. ఫిబ్రవరి 2న కొలంబోకు టికెట్లు బుక్ చేసుకున్నట్టు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వర్గాలు తెలిపాయి.
తమ జట్టు ప్రపంచకప్‌లో పాల్గొనడంపై శుక్రవారం లేదా వచ్చే సోమవారం నాటికి వెల్లడిస్తామని నఖ్వీ తెలిపిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఆ దేశ మాజీ క్రికెటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పీసీబీ ఆలోచనలో పడింది.