Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో భారత బాక్సర్ లొవ్లీనా బొర్గెహైన్(Lovlina Borgohain) సత్తా చాటింది. నాలుగేండ్ల క్రితం కాంస్యం(Bronze Medal)తో మెరిసిన ఆమె ఈసారి కూడా పతక వేటలో ముందంజ వేసింది. తన పంచ్ పవర్‌కు తిరుగులేదని చాటుతూ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన 75 కిలోల విభాగం బౌట్లో లొవ్లొనా చెలరేగింది. ఏకపక్ష పోరులో నార్వేకు చెందిన సున్నివా హొఫ్స్తాద్ (Sunniva Hofstad)ను చిత్తుగా ఓడించింది.
విశ్వ క్రీడల్లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన లొవ్లీనా తొలి రౌండ్ నుంచి ప్రత్యర్థిపై విరుచుకుపడింది. ఆమె ధాటికి సున్నివా బిత్తరపోయింది. దాంతో, 5 పాయింట్లు సాధించిన లొవ్లినాను అంపైర్లు విజేతగా ప్రకటించారు. తద్వారా ఈ ఈశాన్య బాక్సర్ పతకానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది.
Lovlina hits the winning punch 💥🥊
1️⃣ win away from the #Paris2024 medal 🤞#PunchMeinHaiDum#Cheer4Bharat#Boxing pic.twitter.com/KrTIfLGH1m
— Boxing Federation (@BFI_official) July 31, 2024
క్వార్టర్ ఫైనల్లో లీ కియాన్ (చైనా)తో లొవ్లీనా తలపడనుంది. ఈ బౌట్లో విజయం సాధించి సెమీస్ చేరితో పతకం ఖాయమైనట్టే. టోక్యో ఒలింపిక్స్‌లో 69వ విభాగంలో పోటీ పడిన లొవ్లీనా కంచు మోత మోగించిన విషయం తెలిసిందే. మరోవైపు భారీ అంచనాలతో పారిస్‌కు వచ్చిన సీనియర్ బాక్సర్ అంతిమ్ పంగల్, జాస్మినే లంబోరియా, ప్రీతిలు నిరాశపరిచారు.