Paris Olymipics 2024 : ఒలింపిక్స్‌లో లింగ వివాదంలో ఇరుక్కున్న బాక్సర్ ఇమనె ఖెలిఫ్(Imane Khelif) సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. దాంతో, మహిళల బాక్సింగ్‌లో అల్జీరియా (Algeria)కు తొలి పతకం ఖాయం చేసింది. శనివారం ఏకపక్షంగా జరిగిన 66 కిలోల క్వార్టర్ ఫైనల్లో ఇమనే ధాటికి హంగేరి బాక్సర్ అన్నా హమొరి (Anna Hamori) చేతులెత్తేసింది.
ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించిన ఇమనెను జడ్జిలు ఏకగీవ్రంగా విజేతగా ప్రకటించారు. 5-0తో విజయం సాధించిన ఈ యువకెరటం మహిళల బాక్సింగ్ విభాగంలో దేశానికి తొలి పతకం అందించింది. మ్యాచ్ గెలుపొందిన అనంతరం ఇమనే భావోద్వేగానికి లోనైంది. విశ్వ క్రీడల్లో మాతృ భూమికి మెడల్ సాధించిన ఆనందంలో తనపై వస్తున్న విమర్శలను తలచుకొని కన్నీళ్లు పెట్టుకుంది.
ఇమనె ఖెలిఫ్, వియత్నాం బాక్సర్ లిన్ యు టింగ్(Lin You Ting)లు అమ్మాయిలు కాదు అనే వార్తల్ని ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు థామస్ బాచ్ (Thamos Bach) కొట్టిపారేశాడు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన బాచ్.. ఇమనె ఖెలిఫ్, లిన్ యు టింగ్‌లు ఆడపిల్లగానే పుట్టారని, అందరు ఆడపిల్లల మాదిరిగానే పెరిగారని వెల్లడించాడు.