TNPL 2024 : భారత సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ (R Ashwin) టీ20ల్లో దంచేస్తున్నాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL)లో ఓపెనర్ అవతారమెత్తిన ఈ ఆల్‌రౌండర్ అర్ధ శతకాలతో రెచ్చిపోతున్నాడు. టీఎన్‌పీఎల్ క్వాలిఫయర్ 2లో దిండిగుల్ డ్రాగన్స్(Dindigul Dragons) తరఫున ఇన్నింగ్స్ ఆరంభించిన అశ్విన్ విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించాడు. తిరుప్పూర్ టమిజాన్స్(Tiruppur Tamizhans) బౌలర్లను ఉతికేస్తూ మెరుపు అర్ధ శతకం సాధించి జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు.
తొలుత ఆడిన తిరుప్పూర్ జట్టును అశ్విన్ సారథ్యంలోని దిండిగుల్ 108 పరుగులకే పరిమితం చేసింది. అనంతరం స్వల్ప ఛేదనలో ఓపెనర్‌గా వచ్చిన అశ్విన్ ధనాధన్ ఆడాడు. అన్ని రకాల షాట్లు ఆడి ప్రత్యర్థి బౌలర్లను ఒత్తిడిలో పడేశాడు.
Mass-ஆன Ash அண்ணாவின் அரைசதம்!🔥
Description : 📺 காணுங்கள் TNPL | Final | Lyca Kovai Kings vs Dindigul Dragons | நாளை 7:00 PM, Star Sports தமிழில் மட்டும்
#TNPLOnStar #TNPL2024 #NammaOoruNammaGethu pic.twitter.com/2vpJD7KVxB— Star Sports Tamil (@StarSportsTamil) August 3, 2024
అశ్విన్ (69 నాటౌట్: 30 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ హాఫ్ సెంచరీ బాదడంతో దిండిగుల్ జట్టు 9 వికెట్ల విజయంతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇంతకముందు ఎలిమినేటర్ సైతం అశ్విన్ 35 బంతుల్లో 57 పరుగులతో రాణించాడు. ఆగస్టు 4న జరిగే టైటిల్ పోరులో లైకా కావొయ్ కింగ్స్‌తో దిండిగుల్ జట్టు తలపడనుంది.