Bapatla Railway Station | రైలు ఇంజిన్ పైకి ఎక్కి బాలుడి హల్చల్.. నిలిచిపోయిన ఎక్స్‌ప్రెస్ రైలు
Bapatla Railway Station |మతిస్థిమితం లేని బాలుడు చర్య వల్ల పెను ప్రమాదం తప్పింది. రైలు ఇంజిన్‌పైకి ఎక్కిన బాలుడికి పైన విద్యుత్ లైన్లతో ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
అమరావతి : మతిస్థిమితం లేని బాలుడు చర్య వల్ల పెను ప్రమాదం తప్పింది. రైలు ఇంజిన్‌పైకి ఎక్కిన బాలుడికి పైన విద్యుత్ లైన్లతో ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో 15 నిమిషాల పాటు రైల్వే పోలీసులు, ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. వివరాలకు వెళ్తే ..
గూడురు (Gudur)నుంచి విజయవాడ(Vijayawada) వెళ్తున్న ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు(express train ) శనివారం బాపట్ల రైల్వే స్టేషన్ (Bapatla Railway Station ) కు చేరుకుంది. అప్పటికే ప్లాట్‌ఫాం వద్ద ఉన్న మతిస్థిమితం లేని బాలుడు ఒక్కసారిగా రైలు ఇంజిన్‌పైకి ఎక్కాడు. విద్యుత్ లైన్లు తగిలి ప్రమాదం జరుగవచ్చన భయంతో రైలు సిబ్బంది అప్రమత్తమై వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
అనంతరం 15 నిమిషాల పాటు బాలుడిని రైల్వే పోలీసులు బతిమిలాడి, చివరకు బలవంతంగా కిందకు దించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం అతడిని స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. బాలుడు కోల్‌కత్తాకు చెందిన వాడిగా గుర్తించామని, ఆ బాలుడికి మతిస్థిమితంలేదని పోలీసులు తెలిపారు. బాలుడి చర్య వల్ల రైలు దాదాపు 30 నిమిషాల పాటు స్టేషన్లోనే నిలిచిపోయింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

