Tied Up Dogs | కట్టేసిన కుక్కలను వంతెన పైనుంచి నీటిలోకి విసిరేందుకు యత్నం.. అడ్డుకుని రక్షించిన కొందరు
Tied Up Dogs | కొన్ని కుక్కలను తాళ్లతో కట్టేశారు. గోనె సంచుల్లో ఉంచి ఆటోలో వంతెన వద్దకు తీసుకొచ్చారు. ఆ కుక్కలను వంతెన పై నుంచి నదిలోకి పడేసేందుకు ప్రయత్నించారు. అయితే కొందరు వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. గోనె సంచుల్లోని కుక్కలను విడిపించి వదిలేశారు.
భోపాల్: కొన్ని కుక్కలను తాళ్లతో కట్టేశారు. (Tied Up Dogs) గోనె సంచుల్లో ఉంచి ఆటోలో వంతెన వద్దకు తీసుకొచ్చారు. ఆ కుక్కలను వంతెన పై నుంచి నదిలోకి పడేసేందుకు ప్రయత్నించారు. అయితే కొందరు వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. గోనె సంచుల్లోని కుక్కలను విడిపించి వదిలేశారు. మధ్యప్రదేశ్లోని సత్నాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం సాయంత్రం కొందరు వ్యక్తులు ఎలక్ట్రిక్ ఆటోలో ఒక వంతెన వద్దకు చేరుకున్నారు. కాళ్లు, నోరు కట్టేసి గోనె సంచుల్లో కుక్కిన పదికిపైగా కుక్కలను వంతెన పైనుంచి నదిలోని నీటిలో పడేసేందుకు ప్రయత్నించారు.
కాగా, అక్కడున్న కొందరు వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. ఆ గోనె సంచులను తెరిచారు. అందులో ఉన్న కాళ్లు, నోరు కట్టేసిన కుక్కలను విడిపించారు. కట్లు విప్పి వాటిని వదిలేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో వైరల్ అయిన వీడియో క్లిప్ ద్వారా నిందితులను గుర్తించారు. సిటీ కొత్వాలి ప్రాంతంలోని బజ్రహ తోలాలో నివసించే నందు బాసోర్, అతడి సహచరుడు ప్రదీప్ బాసోర్పై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
इन्हे सख्त सजा होनी चाहिए 💥
सतना। कुत्तों के पैर-मुंह रस्सी से बांध कर बोरे में भरकर नदी में फेंकने के प्रयास के मामले में वायरल वीडियो को संज्ञान में लेकर @satna_sp ने दिए कार्रवाई के निर्देश।pic.twitter.com/KB1A2T3MQd— Adv. Shivam Gupta 🥇 (@iShivamG_) August 3, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- bridge
- dogs
- Madhya Pradesh
- Rescued
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

