Amazon Great Freedom Festival sale | ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ (Amazon) స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Freedom Festival Sale) తీసుకొచ్చింది. ఈ నెల ఆరో తేదీ నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి. మొబైల్ ఫోన్లు, విడి భాగాలపై 40 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఎస్బీఐ కార్డులపై కొనుగోలు చేసే వారికి 10 శాతం వరకూ ఇన్ స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది. పలు పాపులర్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్లపై ఈ ఆఫర్లు ప్రకటించింది. వాటి గురించి తెలుసుకుందామా..!
వన్ ప్లస్ నార్డ్ సీఈ4 లైట్, వన్ ప్లస్ నార్డ్4, వన్ ప్లస్ నార్డ్ సీఈ4, వన్ ప్లస్ ఓపెన్, వన్ ప్లస్ 12ఆర్, వన్ ప్లస్ 12 ఫోన్లపై ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు ఐక్యూ ఫోన్లు – ఐక్యూ జడ్9 లైట్ 5జీ, ఐక్యూ 12 5జీ, ఐక్యూ నియో 9ప్రో, ఐక్యూ జడ్7 ప్రో, ఐక్యూ జడ్9, ఐక్యూ జడ్9ఎక్స్ ఫోన్లపైనా ఆకర్షణీయ డిస్కౌంట్లు లభిస్తాయి. వీటితోపాటు రెడ్ మీ 13 5జీ, రెడ్ మీ నోట్ 13 ప్రో, రెడ్ మీ 12 5జీ, రెడ్ మీ నోట్ ప్రో+, షియోమీ 14తోపాటు శాంసంగ్ గెలాక్సీ ఎం15, శాంసంగ్ గెలాక్సీ ఏ35 తదితర ఫోన్లపై ఆఫర్లు ప్రకటించింది అమెజాన్.
ఇంకా పోకో ఎం6 ప్రో, పోకో సీ65, ఒప్పో ఎఫ్27 ప్రో+, టెక్నో పోవా 6 ప్రో, టెక్నో స్పార్క్ 20 ప్రో, రియల్ మీ నార్జో 70 ప్రో ఫోన్లపైనా డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ కింద కూపన్ డిస్కౌంట్ల ద్వారా రూ.10 వేలు, ఎక్స్చేంజ్ ఆఫర్లతో రూ.50 వేల వరకూ రాయితీతోపాటు పలు ప్రమోషనల్ డీల్స్ ప్రకటించింది. అమెజాన్ తోపాటు ఫ్లిప్ కార్ట్, క్రోమా, విజయ్ సేల్స్ కూడా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆఫర్లు ప్రకటించాయి. ఈ సంస్థలు తమ సేల్స్ తేదీలు ఇంకా ప్రకటించలేదు.