DCW vs RCBW : మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్లో ఓటమన్నదే ఎరుగని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఢిల్లీ క్యాపిటల్స్ చెక్ పెట్టింది. గత మ్యాచ్‌లో ఘోర పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటూ భారీ విక్టరీ కొట్టింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో ఢిల్లీ బౌలర్లు చిన్నెలె హెన్రీ(2-22), మరినే కాప్(2-17)లు పంజా విసిరారు. 110 పరుగుల స్పల్ప ఛేదనలో లారా వొల్వార్త్డ్(42 నాటౌట్), జెమీమా రోడ్రిగ్స్(24) కూల్‌గా ఆడి ఢిల్లీని విజయతీరాలకు చేర్చారు. మరినే కాప్(19 నాటౌట్) బౌండరీతో మ్యాచ్‌ను ముగించగా.. ఆరు పాయింట్లతో ఢిల్లీ రెండో స్థానానికి ఎగబాకింది.
ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే గెలవకతప్పని మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ గర్జించింది. అజేయంగా ప్లే ఆఫ్స్ చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు షాకిస్తూ ఏడు వికెట్లతో జయభేరి మోగించింది. బిగ్ హిట్టర్లతో నిండిన ఆర్సీబీని 109కే కట్టడి చేసి బౌలర్లు సగం విజయాన్ని కట్టబెట్టగా.. బ్యాటింగ్ యూనిట్ సమిష్టిగా రాణించడంతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ బరిలో నిలిచింది.
స్వల్ప ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్ షఫాలీ వర్మ(16) శుభారంభమిచ్చింది.
Roaring into the Top 2⃣ 💙@DelhiCapitals with a dominant 7⃣-wicket win in Vadodara to jump to 2nd spot on the points table 👏
Scorecard ▶️ https://t.co/LX37VtsnbS #TATAWPL | #KhelEmotionKa | #RCBvDC pic.twitter.com/vSKMsOAqdk
— Women’s Premier League (WPL) (@wplt20) January 24, 2026
సయాలీ శర్మ ఓవర్లో ఫ్రంట్‌ఫుట్ వచ్చి.. రీచా ఘోష్ రెప్పపాటులో స్టంపౌట్ చేసింది. ఆ కాసేపటికే లిజెల్లీ లీ(6) సైతం ఆమె ఓవర్లోనే వోల్ చేతుల్లోకి బంతిని పంపి వెనుదిరిగింది. ఓపెనర్లు వెనుదిరిగాక జట్టును గెలిపించే బాధ్యత తీసుకుంది కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్(24) అయితే.. లారె 4 పరుగలు వద్ద జెమీమా ఇచ్చిన క్యాచ్‌ను షార్ట్ థర్డ్‌లో సయాలీ సత్ఘరే జారవిడిచింది. ఆ లైఫ్‌ను సద్వినియోగం చేసుకో.. లారా వొల్వార్డ్త్(42 నాటౌట్)తో కలిసి .. 19 పరుగుల వద్ద గౌతమి క్యాచ్ వదిలేయగా.. జెమీమా బతికిపోయింది. కానీ, ఎట్టకేలకు రాధా యాదవ్ ఓవర్లో ఆమె కవర్స్‌లో మంధానకు దొరికింది. దాంతో, మూడో వికెట్ 52 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం మరికే కాప్(19 నాటౌట్), వొల్వార్త్డ్ ఆడుతూపాడుతూ లాంఛనం పూర్తి చేశారు. శ్రేయాంక పాటిల్ వేసిన 16వ ఓవర్ నాలుగో బంతికి మరినే కాప్ బౌండరీ బాదడంతో 7 వికెట్ల తేడాతో ఢిల్లీ గెలుపొందింది.
వరుసగా ఐదు విజయాలతో ప్లే ఆఫ్స్ చేరిన ఆర్సీబీని భారీ స్కోర్ చేయకుండా ఢిల్లీ క్యాపిటల్స్‌ను గొప్పగా అడ్డుకుంది. బౌలింగ్, ఫీల్డింగ్‌లో అదుర్స్ అనిపిస్తూ బెంగళూరు బిగ్ హిట్టర్లకు ముకుతాడు వేశారు ఢిల్లీ ప్లేయర్లు. చిన్నెలె హెన్రీ(2-22), మరినే కాప్(2-17) విజృంభణతో మిడిలార్డర్ కుప్పకూలగా కెప్టెన్ స్మృతి మంధాన(38) రాణించింది. డెత్ ఓవర్లలో నందిని శర్మ(3-26) తన పేస్ పవర్‌తో టెయిలెండర్లను డగౌట్ చేర్చింది. ఆఖరి ఓవర్లో శ్రేయాంక పాటిల్(7), సయాలీ సత్ఘరే(3) ఔట్ కావడంతో ఆర్సీబీ109 పరుగులకే పరిమితమైంది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో ఇదే నాలుగో అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం.
Innings Break!
A fantastic bowling performance from @DelhiCapitals restricts #RCB to 1⃣0⃣9⃣ 👌💙
2⃣ points loading for? 🤔
Scorecard ▶️ https://t.co/LX37VtsnbS #TATAWPL | #KhelEmotionKa | #RCBvDC pic.twitter.com/U0RKAyataI
— Women’s Premier League (WPL) (@wplt20) January 24, 2026