సోమవారం 21 సెప్టెంబర్ 2020
Sports - Jul 28, 2020 , 00:09:46

ఐపీఎల్‌లో బయో బబుల్‌ సమస్యలు

ఐపీఎల్‌లో బయో బబుల్‌ సమస్యలు

న్యూఢిల్లీ: యూఏ ఈ వేదికగా ఐపీఎల్‌ నిర్వహించేందుకు బీసీసీఐ సమాయత్తమవుతుంటే ఫ్రాంచైజీలకు కొత్త కష్టాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా ప్రత్యేకమైన బయో-బబుల్‌ వాతావరణంలో లీగ్‌ నిర్వహణకు మొగ్గుచూపుతున్న బీసీసీఐ అందుకు తగట్లు ప్రామాణిక నిర్వహణ పద్ధతి(ఎస్‌వోపీ)ని ఖరారు చేసేందుకు సిద్ధమవుతున్నది. మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలు ఎస్‌వోపీ మార్గదర్శకాలను పాటించే విధంగా రూపకల్పన చేయబోతున్నది. అయితే బోర్డు చేస్తున్న ఏర్పాట్ల గురించి తెలుసుకునేందుకు ఆయా ఫ్రాంచైజీలు తమ రెక్కీ టీమ్‌లను పంపి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నాయని తెలిసింది. దాదాపు రెండు నెలల పాటు జరిగే లీగ్‌లో ఆటగాళ్ల భార్యలు, స్నేహితురాళ్లకు అనుమతి ఉంటుందా, స్థానిక డ్రైవర్లు, భద్రతా సిబ్బందిని కూడా బయో బబుల్‌ వాతావరణంలో ఉంచుతారా, వసతి సౌకర్యాల విషయాల్లో ఫ్రాంచైజీలకు పలు అనుమానాలు ఉన్నాయి. లీగ్‌ జరుగుతున్నన్ని రోజులు ఆటగాళ్లకు వాళ్ల భార్యలను, స్నేహితురాళ్లను దూరంగా ఉంచడం క్రిమినల్‌ చర్య అని ఓ ఫ్రాంచైజీకి చెందిన సీనియర్‌ అధికారి వ్యాఖ్యానించడం పరిస్థితికి అద్దం పడుతున్నది. 


logo