ODI World Cup 2023 : వన్డే వరల్డ్ కప్‌లో సెమీస్ రేసు నుంచి వైదొలిగిన నెదర్లాండ్స్(Netherlands)కు పెద్ద షాక్ తగిలింది. భారత జట్టుతో చివరిదైన లీగ్ మ్యాచ్‌కు స్టార్ పేసర్ రియాన్ క్లెయిన్(Ryan Klein) దూరమయ్యాడు. అతడి స్థానంలో నోహ్ క్రొయెస్(Noah Croes) జట్టులోకి వచ్చాడు.
గురువారం ఐసీసీ టెక్నకల్ కమిటీ క్రొయేస్ ఆడేందుకు అమోదం తెలిపింది. ఇప్పటివరకూ క్రొయెస్ దేశం తరఫున ఒకే ఒక వన్డే ఆడాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా నవంబర్ 12న బలమైన టీమిండియాతో నెదర్లాండ్స్ తలపడనుంది.
🚨Netherlands replacement named ahead of India clash as pacer Ryan Klein is ruled out of #CWC23.
Details 👇https://t.co/lwLtLQAstE
— ICC (@ICC) November 9, 2023
జింబాబ్వే వేదికగా జరిగిన వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో వెస్టిండీస్‌కు షాకిచ్చిన నెదర్లాండ్స్.. మెగాటోర్నీలో సంచలన విజయాలతో వార్తల్లో నిలిచింది. ఒకదశలో స్కాట్ ఎడ్వర్డ్స్(scott edwards) నేతృత్వంలోని డచ్ జట్టు.. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌పై అద్భుత విజయాలతో సెమీస్ రేసులోకి దూసుకొచ్చింది.
కానీ, ఆ తర్వాత వరుస ఓటములతో వెనకబడింది. ఇంగ్లండ్ చేతిలో 160 పరుగుల తేడాతో ఓడడం ఆ జట్టు చాంపియన్స్ ట్రోఫీ 2025 బెర్తు అవకాశాల్ని దెబ్బ తీసింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన డచ్ జట్టు భారత్‌పై మెరుగైన ప్రదర్శన చేయాలనే కసితో ఉంది.