HS Prannoy | కోలుకున్న ప్రణయ్.. ప్యారిస్ ఒలింపిక్స్ బెర్తు సాధిస్తాడా..?
HS Prannoy : ఆసియా గేమ్స్(Asia Games 2023)లో వెన్ను నొప్పితో బాధపడిన భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్(HS Prannoy) రాకెట్ పట్టాడు. వచ్చే ఏడాది ప్యారిస్ ఒలింపిక్స్ బెర్తుపై కన్నేసిన అతడు శిక్షణ తీసుకోవడం మొదలెట్టాడు. 'ప్యారిస్ ఒలింపిక్స్ బెర్తు సాధించడమే...
HS Prannoy : ఆసియా గేమ్స్(Asia Games 2023)లో వెన్ను నొప్పితో బాధపడిన భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్(HS Prannoy) రాకెట్ పట్టాడు. వచ్చే ఏడాది ప్యారిస్ ఒలింపిక్స్ బెర్తుపై కన్నేసిన అతడు శిక్షణ తీసుకోవడం మొదలెట్టాడు. ‘ప్యారిస్ ఒలింపిక్స్ బెర్తు సాధించడమే నా ఏకైక లక్ష్యం. క్వాలిఫికేషన్ గడువు ముగియడాని కంటే ముందు 10-12 టోర్నమెంట్లు ఉన్నాయి. నేను ఇంకా వెన్ను నొప్పి పూర్తిగా కోలుకోలేదు. అందుకని ఫిట్నెస్ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదు అనుకుంటున్నా’ అని ప్రణయ్ తెలిపాడు.
అంతేకాదు పురుషుల సింగిల్స్‌లో పోటీ గురించి కూడా ప్రణయ్ స్పందించాడు. ప్యారిస్ ఒలింపిక్స్ బెర్తు కోసం గట్టి పోటీ ఉంది. అందుకని నేను బాగా కష్టపడుతున్నా. నిలకడగా ఆడడంపై, ట్రైనింగ్ మరింత దృష్టి పెడుతున్నా అని ప్రణయ్ తెలిపాడు.
ఆసియా క్రీడల కాంస్య పతకంతో ప్రణయ్

ఈ సీజన్లో సూపర్ ఫామ్‌లో ఉన్న ప్రణయ్ చైనా వేదికగా జరిగిన 19వ ఆసియా క్రీడల్లోనూ అద్భుతంగా రాణించాడు. పురుషుల సింగిల్స్‌లో 40 ఏండ్ల చరిత్రను తిరగరాస్తూ కాంస్య పతకంతో మెరిశాడు. టీమ్ విభాగంలో ప్రణయ్ .. లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్, చిరాగ్, సాత్విక్‌తో కలిసి దేశానికి రజతం అందించాడు.
ఇవి కూడా చదవండి
Pakistan Cricket Board | ఇంజమామ్ రాజీనామా ఆమోదం.. త్వరలోనే పీసీబీకి కొత్త సెలెక్టర్..?
DI World Cup 2023 | నాకౌట్ మ్యాచ్ టికెట్ల అమ్మకాలు.. బీసీసీఐ ఏం అన్నదంటే ..?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

