Pakistan Cricket Board | ఇంజమామ్ రాజీనామా ఆమోదం.. త్వరలోనే పీసీబీకి కొత్త సెలెక్టర్..?
Pakistan Cricket Board : పాకిస్థాన్ మాజీ చీఫ్ సెలెక్షన్ కమిటీ ఛైర్ పర్సన్ ఇంజమామ్ ఉల్ హక్(Inzamam Ul Haq) రాజీనామాకు గురువారం పాక్ క్రికెట్ బోర్డు(PCB) ఆమోదం తెలిపింది. త్వరలోనే కొత్త సెలెక్టర్‌ను నియమించనున్నట్టు జకా అష్రఫ్ నేతృత్వంలోని...
Pakistan Cricket Board : పాకిస్థాన్ మాజీ చీఫ్ సెలెక్షన్ కమిటీ ఛైర్ పర్సన్ ఇంజమామ్ ఉల్ హక్(Inzamam Ul Haq) రాజీనామాకు గురువారం పాక్ క్రికెట్ బోర్డు(PCB) ఆమోదం తెలిపింది. త్వరలోనే కొత్త సెలెక్టర్‌ను నియమించనున్నట్టు జకా అష్రఫ్ నేతృత్వంలోని పీసీబీ వెల్లడించింది. వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ చెత్త ప్రదర్శనకు తోడూ.. జట్టు ఎంపికలో అవినీతి ఆరోపణలు రావడంతో ఇంజమామ్ అక్టోబర్ 30న రిజైన్ చేసిన విషయం తెలిసిందే.
పాక్ సీనియర్, జూనియర్ పురుషుల జట్టు సెలెక్షన్ కమిటీకి చైర్ పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన మాజీ క్రికెటర్ ఇంజమామ్.. వరల్డ్ కప్ కోఎసం 15 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశాడు. అయితే.. వరల్డ్ కప్‌లో బాబర్ సేన వరుస పరాజయాలతో నిరాశపరిచడంతో స్వదేశంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు ఇస్లామాబాద్ వేదికగా నడిచే ‘యజో ఇంటర్నేషనల్ లిమిటెడ్’ ప్లేయర్స్ ఏజెన్సీలో ఇంజమామ్‌కు పెట్టుబడులు ఉన్నాయి.
PCB accepts Inzamam-ul-Haq’s resignation
Details here ⤵️ https://t.co/ssGEqfksgM
— PCB Media (@TheRealPCBMedia) November 8, 2023
ప్రస్తుతం పాక్ టీమ్‌లో ఉన్న బాబర్ ఆజమ్, పేసర్ షహీన్ షా అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్‌తో పాటు మరికొందరికి ఈ సంస్థతో అనుబంధం ఉంది. దాంతో, ఇంజమామ్‌కు అనుకూలంగా ఉండే ఆటగాళ్లనే వరల్డ్ కప్ పోటీలకు ఎంపిక చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంజమామ్‌పై వచ్చిన ఆరోపణలు వాస్తవమని తేలితే అతడిపై తీవ్ర చర్యలుంటాయని పీసీబీ ప్రతినిధులు తెలిపారు. ఒకవైళ తాను నిర్దోషిగా తేలితే మళ్లీ చీఫ్ సెలెక్షన్ కమిటీ చైర్ పర్సన్‌గా బాధ్యతలు చేపడతానని ఇంజీ ప్రకటించాడు.

వన్డే వరల్డ్ కప్‌లో బాబర్ ఆజాం నేతృత్వంలోని పాకిస్థాన్ చెత్త ప్రదర్శనతో సెమీస్ రేసులో వెనకబడింది. వరుస ఓటములతో డీలా పడిన పాక్.. 2019 రన్నరప్ న్యూజిలాండ్‌పై అద్భుత విజయంతో పోటీలో నిలిచింది. ఇంగ్లండ్‌తో నవంబర్ 11న జరిగే మ్యాచ్ బాబర్ సేనకు చావోరేవో లాంటిది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే దాయాది జట్టుకు సెమీస్ బెర్తు దక్కే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
ODI World Cup 2023 | నాకౌట్ మ్యాచ్ టికెట్ల అమ్మకాలు.. బీసీసీఐ ఏం అన్నదంటే ..?
Mike Hesson | ఇస్లామామాద్ యూనైటెడ్ హెడ్‌కోచ్‌గా ఆర్సీబీ మాజీ డైరెక్టర్
Meg Lanning | ఆస్ట్రేలియా కెప్టెన్ షాకింగ్ నిర్ణయం.. క్రికెట్‌కు లానింగ్ వీడ్కోలు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: రష్యా నుంచి డీజిల్ కొంటామన్న ట్రంప్.. పుతిన్‌కు గిఫ్ట్ ఇచ్చారన్న జెలెన్స్కీ
Ramayana | కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా.. ‘రామాయణం’ నుంచి ఫస్ట్ లుక్స్ విడుదల
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
High Blood Pressure | రక్తపోటు అదుపులోకి రావడం లేదా? అసలు కారణాలు ఇవే..
Ranabaali | ‘రణబాలి’కి టికెట్ ధరలే ప్లస్ పాయింట్.. ‘జైలర్ 2’తో పోటీలో విజయ్ దేవరకొండకు కలిసొచ్చే అంశమిదే!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

