DCW vs RCBW : మహిళల ప్రీమియర్ నాలుగో సీజన్ రెండో డబుల్ హెడర్‌లో ఆర్సీబీ.. ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడిన ఢిల్లీకి తొలి ఓవర్లోనే లారెన్ బెల్(2-5) షాకిచ్చింది. తొలి ఓవర్లోనే డేంజరస్ ఓపెనర్ లిజినే లీ(4)ని ఔట్ చేసిన తను.. ఆ తర్వాతి బంతికే లారా వొల్వార్డ్త్(0)ను క్లీన్‌బౌల్డ్ చేసింది. రెండో ఓవర్లో సయాలీ సత్ఘరే(2-4) తన పేస్ మ్యాజిక్‌తో వరుస బంతుల్లో జెమీమా రోడ్రిగ్స్(4), మరినే కాప్(0)లను బౌల్డ చేసి ఢిల్లీని కష్టాల్లోకి నెట్టింది. దాంతో.. 10కే నాలుగు వికెట్లు పడ్డాయి. ప్రస్తుతం షఫాలీ వర్మ(1)కి తోడుగా నిక్కీ ప్రసాద్ (0) క్రీజులో ఉంది.
నవీ ముంబైలో ఇదే ఆఖరు మ్యాచ్ కావడంతో ఫలితంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన బౌలింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో జెమీమా సారథ్యంలోని ఢిల్లీ గెలవాల్సింది. కీలకమైన ఈ పోరుకు ఆల్‌రౌండర్ అందుబాటులో లేదు. దాంతో ఆమె స్థానంలో తుది జట్టులోకి వచ్చిన ఆస్ట్రేలియా పేసర్ లుసీ హామిల్టన్ డబ్ల్యూపీఎల్‌లో అరంగేట్రం చేస్తోంది.
W0⃣W 🤩
Sweet sounds of timber 🎶
Lauren Bell with a perfect start for @RCBTweets 🥳
Updates ▶️ https://t.co/J44XcF08az#TATAWPL | #KhelEmotionKa | #DCvRCB pic.twitter.com/HdJQBhXsyH
— Women’s Premier League (WPL) (@wplt20) January 17, 2026
ఢిల్లీ తుది జట్టు : షఫాలీ వర్మ, లిజెల్లీ లీ(వికెట్ కీపర్), లారా వొల్వా్ర్డ్త్, జెమీమా రోడ్రిగ్స్(కెప్టెన్), మరిజానే కాప్, లుసీ హమిల్టన్, స్నేహ్ రానా, నికీ ప్రసాద్, మిన్ను మణి, నందిని శర్మ, శ్రీ చరణి.
ఆర్సీబీ తుది జట్టు : గ్రేస్ హ్యారిస్, స్మృతి మంధాన(కెప్టెన్), జార్జియా వోల్, రీచా ఘోష్(వికెట్ కీపర్), గౌతమి నాయక్, నడినే డీక్లెర్క్, రాధా యాదవ్, ప్రేమా రావత్, శ్రేయాంక పాటిల్, సయాలీ సత్గరే, లారెన్ బెల్.