ముంబై : భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమ వన్డే కెరీర్ను కొనసాగించాలంటే దేశవాళీలు ఆడాల్సిందేనని బీసీసీఐ మరోసారి స్పష్టం చేసింది. దేశం తరఫున ప్రాతినిథ్యం వహించాలంటే డొమెస్టిక్ క్రికెట్లో పాల్గొనాలని సూచించింది. ఈ మేరకు బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘భవిష్యత్లో భారత జట్టుకు ఆడాలంటే దేశవాళీలు ఆడాలని ఆ ఇద్దరికీ బోర్డు, టీమ్ మేనేజ్మెంట్ సూచించింది.
రెండు ఫార్మాట్ల నుంచి వైదొలిగిన ఆ ద్వయం మ్యాచ్ ఫిట్నెస్ను నిరూపించుకోవడం కీలకం’ అని తెలిపాడు. బీసీసీఐ సూచన నేపథ్యంలో హిట్మ్యాన్.. విజయ్ హజారే ట్రోఫీ ఆడేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం. దీనిపై ఇప్పటికే అతడు ముంబై క్రికెట్ అసోసియేషన్కూ సమాచారమందించినట్టు తెలుస్తున్నది. కానీ కోహ్లీ విషయంలో మాత్రం స్పష్టత లేదు.