IPL 2025 : పహల్గామ్ ఉగ్రదాడి యావత్ భారతదేశం ఉలిక్కిపడింది. టెర్రరిస్ట్‌ల అటాక్‌తో అప్రమత్తమైన భారత సైన్యం పలు ప్రాంతాల్లో భద్రతను పెంచింది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ(BCCI) కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్లో ఆటగాళ్ల భద్రత కోసం ‘వజ్ర సూపర్ షాట్'(Vajra Super Shot) అనే సరికొత్త అస్త్రాన్ని ఉపయోగిస్తోంది. దాంతో, మ్యాచ్ సమయంలో డ్రోన్ల ద్వారా గగనతల దాడుల్ని నివారించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇంతకూ ఈ పరికరం ఎలా పని చేస్తుందంటే..?
వజ్ర సూపర్ షాట్ అనేది ప్రత్యేకమైన యాంటీ డ్రోన్(Anti Drone Devise) పరికరం. డ్రోన్ దాడులను సమర్ధంగా అడ్డుకునే ఈ అస్త్రాన్ని భారత్‌కే చెందిన ‘బిగ్ బాంగ్ బూమ్ సొల్యూషన్స్'(Big Bang Boom Solutions) అనే ప్రైవేట్ కంపెనీ తయారు చేసింది. ఈ డివైజ్‌ను సులువుగా వెంట తీసుకెళ్లవచ్చు. దీని సాయంతో మైదానంలో డ్రోన్ దాడులను నివారించడం సాధ్యమేనంటున్నారు నిపుణులు. ఈ పరికరం నాలుగు కిలోమీటర్ల ఎత్తులో ఉన్న శత్రు డ్రోన్లను పసిగట్టగలదు.
🚨 Security Upgraded at #IPL2025!
Introducing the Vajra Super Shot—a cutting-edge anti-drone system deployed to protect players and fans from aerial threats.
Learn how this indigenous tech is safeguarding our stadiums:https://t.co/XeEXMJKm9P— myKhel.com (@mykhelcom) April 27, 2025
రేడియో సిగ్నల్స్‌ను పంపించడం ద్వారా వజ్ర సూపర్ షాట్ సదరు డ్రోన్ నియంత్రణను దెబ్బతీస్తుంది. దాంతో.. శత్రువులు ఆ డ్రోన్‌ను ఉపయోగించలేరు. అనుమానిత డ్రోన్లను నిర్వీర్వం చేశాక.. వజ్ర సూపర్ షాట్ తిరిగి యథాస్థానానికి చేరుకుంటుంది. తద్వారా స్టేడియం పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గస్తీ కాస్తుందీ యాంటీ డ్రోన్ పరికరం. ఏప్రిల్ 26న ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR), పంజాబ్ కింగ్స్(Punjab Kings) మ్యాచ్ సమయంలో దీన్ని తొలిసారి వినియోగించారు. ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగే ప్రతి మైదానంలో ఇప్పుడీ ఈ యాంటీ డ్రోన్ డివైజ్‌ను వాడుతున్నారు.