KCR | హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీని నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోయారని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. మంచిగున్న తెలంగాణను ఆగం పట్టించారని కేసీఆర్ మండిపడ్డారు. మొగోడు అని మొలక అలికేందుకు పిలిస్తే.. ఎలుక పిల్లను చూసి ఎల్లెలకల పడ్డడట.. అని కేసీఆర్ విమర్శించారు.
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ.. చాలా సిపాయిలం.. మా అంతా సియిపాలు లేరంటే నమ్మి బోల్తా పడ్డాం.. గల్లంతు అయ్యాం.. ఒక ఊరిలో నాట్లు వేసే టైమ్ వస్తే వడ్లు అలులకుతున్నడు ఓ రైతు. మొలకకు అలుకుడు చేస్తం కదా.. తుకాలు పోయమా..? పెద్ద మొగోడు అని ఒకర్ని పిలిచిండ్రట. మొగోడు అని మొలక అలికేందుకు పిలిస్తే.. ఎలుక పిల్లను చూసి ఎల్లెలకల పడ్డట. ఇక మా అంత సిపాయిలు లేరు.. మేం తెచ్చే ఇస్తాం.. ఆరు చందమామలు.. ఏడు సూర్యుళ్లు పెడుతాం అని నమ్మబలికి ప్రజలను దగా చేసి, మంచిగున్న తెలంగాణను ఆగం పట్టించి ఓట్లు వేయించుకుని ప్రజలను మోసం, దగా చేశారు. ఈ మాట వాస్తవం. ఇవాళ మమ్మల్ని నమ్ముతలేరు.. అప్పు పుడుతలేదని మాట్లాడుతుండ్రు. ఎక్కడికెళ్లి తెచ్చి చేయాలని అంటున్నరు. అపారమైన అనుభవం ఉందని అప్పుడు అన్నరు.. ఇప్పుడేమో ఎల్లెలకల పడుతుండ్రు. నా ప్రసంగం టీవీల్లో వినే కోట్లాను కోట్ల మందికి విన్నవిస్తున్నా.. ఇంత మోసం ఉంటదా.. ఇంత దగా ఉంటదా.. ఎంత వరకు ఇది కరెక్ట్.. తెలంగాణను ఇప్పుడు బొందల పడగొట్టిండ్రు.. ఎంత ఘోరమైన ఫలితం చూస్తున్నాం అని కేసీఆర్ పేర్కొన్నారు.