ICC World Cups : క్రికెట్‌ను ఎంతగానో అభిమానించే భారత గడ్డపై వరల్డ్ కప్(World Cups)ల జాతర జరుగనుంది. వచ్చే ఆరేండ్లలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ఐసీసీ ట్రోఫీ(ICC Trophy)లకు ఇండియా ఆతిథ్యమివ్వనుంది. అవును.. మీరు చదివేది నిజమే. ప్రపంచ క్రికెట్లో కింగ్ మేకర్ అయిన భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI)కి ఐసీసీ ఇస్తున్న బంపర్ ఆఫర్ ఇది. 2025 నుంచి 2031 వరకూ భారత్ వేదికగా నాలుగు వరల్డ్ కప్‌లు జరుగనున్నాయి.
వచ్చే ఏడాది బీసీసీఐ మహిళల వరల్డ్ కప్ పోటీలను నిర్వహించనుంది. అనంతరం 2026లో భారత్, శ్రీలంకలతో కలిసి సంయుక్తంగా పురుషుల టీ20 ప్రపంచ కప్ టోర్నీకి ఆతిథ్యమివ్వనుంది. ఇక 2029లో ఇండియా వేదికగా ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది. ఆ తర్వాత రెండేండ్లకు జరుగబోయే వన్డే వరల్డ్ కప్ హక్కులను బంగ్లాదేశ్‌తో కలిసి బీసీసీఐ దక్కించుకుంది.
వచ్చే ఏడాది నుంచి 2031 వరకూ మొత్తం 10 ఐసీసీ టోర్నీలు జరుగనున్నాయి. ఈ పెద్ద ఈవెంట్లను భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలకే పరిమితం చేయకూడదనే ఆలోచనతో మిగతా దేశాలకూ ఐసీసీ చాన్స్ ఇచ్చింది. ఏ దేశంలో ఏ టోర్నీ జరుగుతుందో చూద్దాం.
1. చాంపియన్స్ ట్రోఫీ, 2025 – పాకిస్థాన్.
2. మహిళల వన్డే వరల్డ్ కప్, 2025 – భారత్.
3. పురుషుల టీ20 వరల్డ్ కప్, 2026 – భారత్, శ్రీలంక.
4. మహిళల టీ20 ప్రపంచ కప్, 2026 – ఇంగ్లండ్.
5. పురుషుల వరల్డ్ కప్ 2027 – దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే.
According to reports from the Asian News International agency, the BCCI is unlikely to send an India team to Pakistan for the 2025 ICC Champions Trophy.
Read here🔽https://t.co/G2We8c7pL1 pic.twitter.com/dRlHlmdnoj
— Wisden (@WisdenCricket) July 11, 2024
6. మహిళల తొలి చాంపియన్స్ ట్రోఫీ, 2027 – శ్రీలంక.
7. పురుషుల టీ20 వరల్డ్ కప్, 2028 – ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.
8. చాంపియన్స్ ట్రోఫీ, 2028 – భారత్.
9. పురుషుల టీ 20 వరల్డ్ కప్, 2030 – ఇంగ్లండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్.
10. పురుషుల వన్డే వరల్డ్ కప్, 2031 – భారత్, బంగ్లాదేశ్.