Gold Rates | దేశీయ బులియన్ మార్కెట్లో మళ్లీ బంగారం ధరలు పుంజుకుంటున్నాయి. ఈ నెల 23న కేంద్ర బడ్జెట్ లో బంగారం, వెండి దిగుమతిపై కస్టమ్స్ సుంకం 15 నుంచి ఆరు శాతానికి తగ్గించిన తర్వాత మూడు సెషన్లలో రూ.5000 మేరకు తగ్గిన తులం బంగారం ధర తిరిగి మళ్లీ పెరుగుతున్నది. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.550 వృద్ధి చెంది రూ.71,600లకు చేరుకున్నది. అంతర్జాతీయ ధోరణులకు అనుగుణంగా దేశీయంగా బంగారం ఆభరణాలకు గిరాకీ పెరగడంతో మంగళవారం బంగారం ధరలు పెరిగాయి. సోమవారం తులం బంగారం ధర రూ.950 పెరిగి రూ.71,050 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. మరోవైపు కిలో వెండి ధర యధాతథంగా రూ.84,500 వద్ద స్థిరంగా కొనసాగింది.
అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర 7.40 డాలర్లు పుంజుకుని 2,432.90 డాలర్లు పలికింది. కామెక్స్ సిల్వర్ లో ఔన్స్ వెండి ధర 0.27 శాతం పెరిగి 27.94 డాలర్ల వద్ద పలికింది. బుధవారం ముగిసే యూఎస్ ఫెడ్ రిజర్వు సమీక్షా సమావేశంలో వడ్డీరేట్లపై ఎటువంటి నిర్ణయం తీసుకోక పోవచ్చునని చెబుతున్నారు. వచ్చే సెప్టెంబర్ నెలలో వడ్డీరేట్ల తగ్గింపు విషయమై యూఎస్ ఫెడ్ రిజర్వు సంకేతాలిస్తుందా..? అన్న విషయమై బులియన్ వ్యాపారులు కేంద్రీకరించారు.
Realme | రియల్మీ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లు రియల్మీ 13 ప్రో.. రియల్మీ 13 ప్రో+ ఆవిష్కరణ
LTCG Tax | ఎల్టీసీజీ రద్దు ప్రతిపాదనే లేదు.. తేల్చేసిన కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి
Gold – Silver Rates | భారీగా తగ్గిన బంగారం వెండి ధరలు.. యూఎస్ ఫెడ్ వడ్డీరేట్లు తగ్గించేనా..?!