UP CM Yogi Adityanath | యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ సంచలన ఆరోపణలు.. సమాజ్ వాదీ పార్టీతోనే మహిళల భద్రతకు తీవ్ర ముప్పు..!
UP CM Yogi Adityanath |సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) వల్ల ఉత్తరప్రదేశ్‌లో మహిళల భద్రతకు ‘తీవ్రమైన ముప్పు’ పొంచి ఉందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు.
UP CM Yogi Adityanath |సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) వల్ల ఉత్తరప్రదేశ్‌లో మహిళల భద్రతకు ‘తీవ్రమైన ముప్పు’ పొంచి ఉందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. మహిళలపై దాడుల కేసుల్లో ఉన్న వారంతా సమాజ్ వాదీ పార్టీ నేతలేనని అన్నారు. రాష్ట్రంలో మహిళలు, బాలలపై లైంగిక దాడులను నివారించడానికి ప్రభుత్వం వద్ద ప్రణాళిక ఉందా? అని యూపీ అసెంబ్లీలో ఎస్పీ సభ్యుడు రాగిణి సొంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ యోగి ఆదిత్యనాథ్ ఈ ఆరోపణ చేశారు.
‘మహిళల భద్రత పట్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సీరియస్ గా వ్యవహరిస్తున్నది. దాని ఫలితంగానే మహిళలు, బాలలపై దాడుల కేసులు నిరంతరం తగ్గుతున్నాయి. నేరస్తుల మనస్సుల్లో భయాందోళన కలిగించాం’ అని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి మహిళల భద్రత పట్ల పూర్తిగా అప్రమత్తంగా, చురుగ్గా వ్యవహరిస్తున్నదని, ప్రతి కూతురు, వ్యాపార వేత్తకూ భద్రత కల్పించేందుకు కట్టుబడి పని చేస్తుందన్నారు.
2017లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే యాంటీ రోమియో స్క్వాడ్ ఏర్పాటు చేయడమే తమ తొలి చర్య అని యోగి ఆదిత్యనాథ్ గుర్తు చేశారు. యాంటీ రోమియో స్క్వాడ్ ఏర్పాటు చేయడాన్ని తొలుత వ్యతిరేకించిందే సమాజ్ వాదీ పార్టీ అని ఆరోపించారు. 2016లో ఎస్పీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే ఇప్పుడు అన్ని రకాల నేరాలు తగ్గుతూ వచ్చాయన్నారు.
ఇవి కూడా చదవండి :
Realme | రియల్మీ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లు రియల్మీ 13 ప్రో.. రియల్మీ 13 ప్రో+ ఆవిష్కరణ
LTCG Tax | ఎల్టీసీజీ రద్దు ప్రతిపాదనే లేదు.. తేల్చేసిన కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి
Gold – Silver Rates | భారీగా తగ్గిన బంగారం వెండి ధరలు.. యూఎస్ ఫెడ్ వడ్డీరేట్లు తగ్గించేనా..?!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

