ముంబై: కొద్దిరోజుల క్రితమే ఐసీసీ చైర్మన్గా నియమితుడైన జై షాను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సన్మానించనుంది. ఆదివారం (జనవరి 12న) ముంబైలో జరిగే స్పెషల్ జనరల్ మీటింగ్ (ఎస్జీఎం)లో బీసీసీఐ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
షా.. 2019 అక్టోబర్ నుంచి గతేడాది నవంబర్ దాకా బీసీసీఐ కార్యదర్శిగా కొనసాగాడు.