BCCI : టీ20ల్లో మొన్నటివరకూ అజేయశక్తిగా కొనసాగిన భారత జట్టు (Team India) వరసగా రెండో సిరీస్ కోల్పోవడం అభిమానులకు మింగుడుపడడం లేదు. వరల్డ్‌కప్ ఛాంపియన్ టీమిండియా ఇంత దారుణంగా ఓడడంపై మాజీలు, విశ్లేషకులు అవాక్కవుతున్నారు. బ్రిస్టల్‌లో ఘనమైన రికార్డు ఉన్నప్పటికీ నాలుగో టీ20లో 9 వికెట్లతో చిత్తైన భారత్ సిరీస్ కోల్పోయింది. ఈ ఘోర పరాజయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి సీరియస్‌గా తీసుకుంది. సిరీస్ ముగియడమే ఆలస్యం సమీక్ష నిర్వహించి.. ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బందిపై చర్యలకు తీసుకోనుంది.
ఇంగ్లండ్ పర్యటనలో హ్యాట్రిక్ ఓటములతో భారత జట్టు పొట్టి సిరీస్‌ను సమర్పించుకుంది. సిరీస్‌లో నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో 9 వికెట్ల పరాజయంతో విమర్శలకు కేంద్రంగా మారింది టీమిండియా. ఐర్లాండ్ చేతిలో వైట్‌వాష్, ఆపై ఇంగ్లీష్ టీమ్ దెబ్బకు తలవంచిన భారత జట్టు ప్రదర్శనపై బీసీసీఐ సమీక్షకు సిద్ధమవుతోంది. ఐదు టీ20ల సిరీస్ ముగియడమే ఆలస్యం ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన, కోచ్ గౌతం గంభీర్, ఇతర సహాయక సిబ్బంది పనితీరును విశ్లేషించనుంది.
🚨 GAUTAM GAMBHIR & SHREYAS IYER IN TROUBLE:
🗣️ BCCI Secretary Devajit Saikia said:
“We are deeply concerned about the Indian team’s performance. Once this series is over, we will definitely hold a review meeting with the captain and coach to understand what is going wrong. We… pic.twitter.com/ZyT8k5mBCP
— Indian Cricket Ministry (@Tejashyyyyyy) July 10, 2026
‘టీ20ల్లో భారత జట్టు ప్రదర్శన పట్ల ఆందోళన చెందుతున్నాం. ఇంగ్లండ్ సిరీస్ ముగియగానే కెప్టెన్ కోచ్‌తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహిస్తాం. అసలు పొరపాటు ఏం జరిగింది? ఎందుకు సిరీస్ ఓడాం? అనేది ఆరా తీస్తాం. తప్పులను సరిదిద్దుకొని మళ్లీ జట్టుకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాం’ అని బీసీసీఐ సెక్రటీ దేవజిత్ సైకియా పేర్కొన్నాడు.
🚨 GAUTAM GAMBHIR IN DANGER:
> Series defeats against Ireland and England has triggered the BCCI.
> BCCI will conduct a performance review.
> BCCI will assess the performance of the players along with the coaching staff.
> Gautam Gambhir job is also under the scanner despite his… pic.twitter.com/KPOoKcufym— Indian Cricket Ministry (@Tejashyyyyyy) July 10, 2026
స్వదేశంలో టీ20 ప్రపంచకప్ సాధించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను తప్పించి.. శ్రేయాస్ అయ్యర్‌కు పగ్గాలు ఇవ్వడం బెడిసికొట్టింది. అలానే ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలు దూరమవ్వడం భారత జట్టుకు ప్రతికూలంగా మారగా.. వైభవ్ సూర్యవంశీ కోసం సంజూ శాంసన్‌ను తప్పించడం పెద్ద పొరపాటని స్పష్టమైంది.

అలానే.. కోచ్‌గా గంభీర్ పనితీరు కూడా ఆశించిన స్థాయిలో లేదు. అతడి నేతృత్వంలో ఆటగాళ్లను పరీక్షించడం ఓ అలవాటుగా మారడం, ప్రతిభావంతులను పక్కన పెట్టేయడం వంటివి విమర్శలకు తావిస్తోంది. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ కప్ 2027 అనంతరం గౌతీ భవితవ్యం కూడా తేలిపోనుంది.