ఐపీఎల్ పండుగ వచ్చేసింది. కరోనా భయంతో కేవలం నాలుగు వేదికల్లోనే జరుగుతున్న ఈ టోర్నీలో ప్రేక్షకుల సందడి చాలా తక్కువగా ఉంది. టోర్నీ ఆరంభంలోనే సుమారు 25 శాతం మంది ప్రేక్షకులనే అనుమతిస్తామని బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దేశంలో రోజురోజుకూ కరోనా కేసులు తగ్గిపోతున్నాయి.
ఈ క్రమంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ మ్యాచులకు 65 నుంచి 70 శాతం ప్రేక్షకులను అనుమతించాలని బీసీసీఐ యోచిస్తోందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల అవుతుందని సమాచారం. ఆ తర్వాత ఆన్లైన్లో టికెట్లు అందరికీ అందుబాటులోకి రానున్నాయి.