బెంగళూరు: భారత టెస్టు, వన్డే జట్ల సారథి శుభ్‌మన్ గిల్ సోమవారం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)కు పయనమయ్యాడు. దక్షిణాఫ్రికాతో కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టులో మెడ నొప్పితో రెండో టెస్టుకు దూరమైన అతడు.. వన్డేలూ ఆడటం లేదు. అయితే ఈనెల 9 నుంచి సఫారీలతో మొదలుకాబోయే టీ20 సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న గిల్.. ఫిట్నెస్ నిరూపించుకునేందుకు సీవోఈకి వెళ్లినట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
సీవోఈలో నిపుణుల పర్యవేక్షణలో గిల్ బ్యాటింగ్, మ్యాచ్ ఫిట్‌నెస్‌పై నిర్ధారణకు వచ్చాక అతడు పూర్తిస్థాయిలో ఫిట్‌గా ఉంటేనే టీ20 జట్టులోకి తీసుకోనున్నట్టు తెలుస్తున్నది. అయితే ప్రస్తుతానికైతే సఫారీలతో టీ20 సిరీస్‌కు అతడు పాల్గొనే అవకాశాలు 50-50గానే ఉన్నాయని తెలుస్తున్నది.
ఆసియా కప్ సందర్భంగా గాయపడి సీవోఈలో పునరావాసం పొందిన ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా పూర్తిగా ఫిట్ అయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న సయ్యిద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడేందుకు అతడికి సీవోఈ నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. దీంతో అతడు మంగళవారం పంజాబ్‌తో జరుగబోయే మ్యాచ్‌లో బరోడా తరఫున బరిలోకి దిగనున్నాడు.