WPL 2024 : మహిళల క్రికెట్లో సరికొత్త అధ్యాయానికి నాంది పలికిన మహిళల ప్రీమియర్ లీగ్(Womens Premiere League) రెండో సీజన్‌కు సిద్ధమవుతోంది. తొలి సీజన్ కంటే రెట్టించిన ఉత్సాహంతో ఈసారి టోర్నీ జరుగనుంది. అంతకంటే ముందు రెండో సీజన్ మినీ వేలం జరుగనుంది. వేలానికి మరో రెండు రోజులే ఉండడంతో బీసీసీఐ(BCCI) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అంతేకాదు గురువారం సాయంత్రం బీసీసీఐ బాస్ రోజర్ బిన్ని(Roeger Binni) నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
మహిళా క్రికెట్‌ను ప్రమోట్ చేసేందుకు ఏర్పాటైన ఈ కమిటీకి బీసీసీఐ సెక్రటరీ జై షా(Jai Shah) కన్వీనర్‌గా వ్యవహరించనున్నాడు. ఈ కమిటీలోని మిగతా సభ్యులు ఎవరంటే..? ఐపీఎల్ చైర్పర్సన్ అరుణ్ ధుమాల్, బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, బీసీసీఐ ట్రెజరీ అశిష్ షెలార్, బీసీసీఐ జాయింట్ సెక్రటరీ దేవజిత్ సైకియా, మధుమతి లేలె, ప్రభుతేజ్ భాటియా.
🚨 NEWS 🚨
BCCI announces esteemed Committee Members for Women’s Premier League.
Details 🔽 #TATAWPL https://t.co/xqudYTf7O1
— Women’s Premier League (WPL) (@wplt20) December 7, 2023
‘పలు రకానల నేపథ్యం ఉన్న నిపుణులతో ఈ కమిటీని ఏర్పాటు చేశాం. వీళ్ల అనుభవం, క్రీడలకు గుర్తింపు తేవాలనే ఆరాటం మహిళల ప్రీమియర్ లీగ్ పురోగతికి తోడ్పడుతుందని ఆశిస్తున్నాం. కమిటీ సభ్యులందరూ డబ్ల్యూపీఎల్ విజయవంతం అయ్యేందుకు కృషి చేస్తారు’ అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. డిసెంబర్ 9న ముంబైలోని గ్రాండ్ హయత్‌లో డబ్ల్యూపీఎల్ 2024 మినీ వేలం జరుగనుంది. తొలి సీజన్ వేలాన్ని నిర్వహించిన మల్లికా సాగర్(Mallika Sagar)కే మరోమారు బీసీసీఐ బాధ్యతలు అప్పజెప్పింది.