BCCI : భారత క్రికెట్ నియంత్రణ మండలి ఎన్నికల తేదీ వచ్చేసింది. సెప్టెంబర్లోనే కొత్త కార్యవర్గంను ఎన్నుకోనున్నారు. ఈ ఏడాది జరగబోయే వార్షిక సమావేశం రోజైన సెప్టెంబర్ 28న ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. ముంబైలో ఉన్న బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ఉదయం 11:30 గంటలకు సమావేశం జరుగనుంది. ఈ మీటింగ్లో ఎన్నికల ప్రక్రియ గురించి చర్చించనున్నారు. సెప్టెంబర్ రెండో వారంలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటీవలే బీసీసీఐ అధ్యక్షుడి స్థానం నుంచి రోజర్ బిన్ని వైదొలగాడు. వయసు 70 ఏళ్లు దాటడంతో అతడు బాధ్యతల నుంచి తప్పుకోగా.. కార్యదర్శిగా ఉన్న రాజీవ్ శుక్లా మధ్యంతర అధ్యక్షుడిగా వ్యవహరించనున్నాడు. అయితే.. ప్రస్తుతం బోర్డులోని సభ్యుల పదవీకాలం కూడా ముగియనున్న నేపథ్యంలో సెప్టెంబర్ 18న ఎన్నికలు జరపాలని బీసీసీఐ తీర్మానించింది. అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శితో పాటు కోశాధికారి ఎంపిక కోసం ఎన్నికలు జరుగనున్నాయి.
JUST IN – The BCCI has scheduled its AGM on September 28
The agenda is to hold elections for the posts of president, vice-president, secretary, joint secretary and treasurer. pic.twitter.com/MRxa7qIpzu
— Cricbuzz (@cricbuzz) September 6, 2025
ఈ సమావేశంలో అపెక్స్ కౌన్సిల్.. ఐపీఎల్, డబ్ల్యూపీఎల్ కోసం గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేయడంపై కూడా ఈ సమావేశంలో చర్చకు రానుందని సమాచారం. అపెక్స్ కౌన్సిల్లో బీసీసీఐ సాధారణ కార్యవర్గంలోని సభ్యుడు ఒకరు.. భారత క్రికెట్ అసోసియేషన్ నుంచి ఇద్దరు సభ్యులుగా ఉంటారని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.